రాజకీయాల్లో బంధాలు లేవని ఎవరన్నారు. ఉంటాయి. కచ్చితంగా అవి ఎక్కడో ఓ చోట పెనవేసుకుని ఉంటాయి. అయితే కొన్ని బయటకు కనిపిస్తాయి. మరి కొన్ని మాత్రం అలా కనిపించీ కనిపించకుండా ఉంటాయి. ఇపుడు ఏపీలో కొన్ని పార్టీల తెర వెనక బంధంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.


టీడీపీ, జనసేనల మధ్యన లోపాయికారి పొత్తు ఉందని అంతా అనుకుంటున్నారు. దానికి తగ్గట్లే చేసే పనులు కూడా కనిపిస్తున్నాయి. విశాఖ ఇప్పటికి అనేక సార్లు వచ్చిన చంద్రబాబు గాజువాక మాత్రం రావడం లేదు. ఆ వూసు ఎత్తడంలేదు. ప్రచారానికి కోరి పిలిచిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాటను పక్కన పెడుతున్నారట. దాంతో పల్లాలో ఎక్కడ లేని టెన్షన్ వచ్చేస్తోందట. పవన్ కోసమా నన్ను బలి పశువు చేస్తున్నారంటూ పల్లా సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని టాక్. 


ఇక్కడ టీడీపీ అసమ్మతి క్యాడర్ తో పాటు కీలక నేతలు కూడా స్తబ్దుగా ఉండడం తో పుట్టె మునుగుతుందేమోనని పల్లా పడుతున్న బాధలో అర్ధముందని అంటున్నారు. పార్టీ నిర్మాణం ఏమాత్రం లేని జనసేన గాజువాకలో గెలుస్తుందని డేరింగ్ గా పవన్ నామినేషన్  వెసినపుడే అంతా ఇక్కడ అనుమానంతో చూశారు. ఇపుడు బాబు గారు గాజువాక వైపు కన్నెత్తి చూడకపోవడంతో అదే నిజం అయిందని అంటున్నారు. 


ఇక పవన్ లోకేష్ మీద పెద్ద గొంతేసుకుని గత ఏడాది  గుంటూర్ మీటింగులో ప్రసంగాలు చేశారు. తీరా అదే లోకేష్ బాబు మంగళగిరిలో పోటీ చేస్తూంటే మాత్రం ఆ వూసే లేదు. పైగా అక్కడ పోటీ పెట్టకుండా ఆ మాటే మరచిపోయి తిరుగుతున్నారని కామెంట్స్ వస్తున్నాయి. దీంతో పవన్ బాబుల మధ్య ఏదో ఉందన్నది నిజమన్న భావన బలపడుతోంది మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: