జాతీయ మీడియా మొత్తం వైసిపికే మెజారిటీ వస్తుందని చెబుతున్న నేపధ్యంలో  చంద్రబాబునాయుడు మీడియా మేల్కొంది. ఏకంగా తెలుగుదేశంపార్టీకి 135 అసెంబ్లీ సీట్లొస్తాయని లెక్కలు గట్టింది. నేరుగా తన లెక్కలని చెబితే జనాలు నమ్మరని అనుకునే ఏబిపి మీడియా తరపున లోక్ నీతి-సిఎస్ డిఎస్ సర్వే పేరుతో ఫలితాలు వెల్లడించింది. మొత్తం 175 అసెంబ్లీల్లో 135, 25 లోక్ సభ సీట్లలో 22 దాకా వస్తాయని సర్వేలో తేలిందని కథనాలు ప్రచురించింది.

 

జాతీయ మీడియాలు నిర్వహించిన ప్రతీ సర్వేలోను స్పష్టమైన ఆధిక్యతను వైసిపి ఇచ్చాయి. ఏ ఒక్క సర్వేలో కూడా టిడిపి గెలుస్తుందని చెప్పలేదు. దాంతో టిడిపి శ్రేణులు ఢీలా పడిన మాట వాస్తవం. అలానే వదిలేస్తే ముందు ముందు మరింత కష్టమని చంద్రబాబు అనుకున్నారో ఏమో ? అందుకని లోక్ నీతి, సిఎస్ డిఎస్ సర్వే అంటూ ఓ కథనం అచ్చేసింది.   దాని ప్రకారం రాబోయే ఎన్నికల్లో టిడిపికి అఖండ మెజారిటీ ఖాయమట.

 

మొత్తం 175 సీట్లలో 135 సీట్లు టిడిపికి ఖాయమంటే అఖండవిజయం కాక మరేమవుతుంది లేండి ? కాకపోతే అన్ని సీట్లు చంద్రబాబునాయుడుకు ఎలా వస్తుందనేదే ప్రశ్న. సదరు మీడియా చెబుతున్న దాని ప్రకారం అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనను జనాలు మెచ్చుకుంటున్నారట. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమిటో అర్ధం కావటం లేదు. సంక్షేమం అంటే జన్మభూమి మాఫియా చెప్పిన పార్టీ వాళ్ళకే మెజారిటీ ఫలాలందింది. ఇక సుపరిపాలన అంటే ఏమిటో సర్వే చేసిన సంస్ధలే చెప్పాలి.

 

ఇక రైతులు, డ్వాక్రా మహిళల రుణామాఫీ, పసుపు-కుంకుమ తదితరాల వల్ల అందరూ చంద్రబాబు వైపు మొగ్గుచూపుతున్నారట. నిజానికి రుణమాఫీ హామీని సంపూర్ణంగా అమలు కాలేదని అందరికీ తెలిసిందే. పసుపు కుంకుమ లో డబ్బులే పడటం లేదు. దాంతో రైతులు, డ్వాక్రామహిళలు ఎక్కడికక్కడ మంత్రులను నిలదీసిన విషయం అందరికీ తెలిసిందే.

 

చివరగా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులట. రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు వచ్చాయని అడిగితే ఎంతసేపు రూ 15 లక్షల కోట్ల ఎంవోయులనే చెబుతున్నారు. అంతేకాని ఇన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పలేకపోతున్నారు. పోలవరం, రాజధాని నిర్మాణమట. రాజధాని అన్నది గ్రాఫిక్స్ కే పరిమితమన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక పోలవరం మొత్తం అవినీతి కంపే కొడుతోంది. వాస్తవాలు ఇలా వుంటే చంద్రబాబు విశ్వసనీయను చూసి జనాలు టిడిపి వైపే మొగ్గు చూపుతారని చంద్రబాబు మీడియా కథనం అచ్చేయటం పెద్ద జోక్ గా తయారైంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: