ఏపీలో అందరినీ ఆకట్టుకుంటున్న అసెంబ్లీ సీట్లలో భీమునిపట్నం ఒకటి. ఇక్కడ నుంచి సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్ కూడా పోటీకి ఓ దశలో రెడీ అన్నారు. ఆ తరువాత అదే టీడీపీ నుంచి మాజీ జేడీ లక్ష్మీ నారాయణ కూడా పోటీ చేస్తారని ప్రచారం సాగింది. నిజానికి టీడీపీకి కంచుకోట లాంటి సీటు భీమిలీ..


ఈ సీటు ఇంత వేడి పుట్టించడానికి కారణం అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్ధి అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరడం. అవంతి వంటి బలమైన నాయకుడు ఇక్కడ నుంచి పోటీకి దిగాడన్న న్యూస్ తో ఒక్కసారిగా భీమిలీలో పొలిటికల్ సీన్ మారిపోయింది. అంతవరకూ టీడీపీకి కంచుకోట లాంటి ఈ సీటి మంచు కోటలా మారిపోయింది. ఇపుడు ఇక్కడ టీడీపీ జెండాల కంటే నాలుగింతలు వైసీపీ జెండాలు ఎగురుతున్నాయి. ఎక్కడ చూసినా ఫ్యాన్ గాలి గట్టిగా వీస్తోంది.


భీమిలీలో 2009 ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ తొలిసారి పోటీ చేశారు. అపుడు ఆయన చేసిన పనులు ఇక్కడ జనాలు తలచుకుంటూ మళ్ళీ ఆయనే రావాలని బలంగా కోరుకున్నారు. అయితే 2014 నాటికి గంటా శ్రీనివాసరావుకు టీడీపీ టికెట్ ఇచ్చింది. దాంతో అవంతి బాధపడినా 2019 లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేస్తానని కచ్చితంగా చెప్పుకొచ్చారు. అయితే గంటా అడ్డుపడడంతో ఆయన వైసీపీలోకి వెళ్ళి మరీ పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ పోటీలో ఉన్నా అది నామమాత్రంగానే ఉందని అంటున్నారు.  మొన్నటి ఎన్నికల్లో మంత్రి గంటాకు ఇక్కడ 37 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈసారి అది రెట్టింపు అయి అవంతికి 80 నుంచి లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తారని అంటున్నారు. వార్ వన్ సైడ్ అని కూడా గట్టిగా చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: