వైసీపీ అధినేత జగన్ గతంలో చేసిన పొరపాట్లను పక్కన పెట్టేసి ఈసారి చాల జాగ్రత్తగా ఎన్నికల రంగంలోకి దిగారు. ఏం చేసినా అయన పక్కా క్లారిటీతో చేస్తున్నారు. ఓ విధంగా జగన్ మారారని చెప్పాలి. అన్ని వర్గాలకు చేరువ అవుతూ తనను తాను ఆమోదయోగ్యమైన నేతగా ఆవిష్కరించుకున్నారు.


ఇక జగన్ ఏపీలో కొన్ని ప్రధాన వర్గాలపై గురి పెట్టారు. ఆ వర్గాలే ఇపుడు వైసీపీకి అండగా నిలవబోతున్నాయి. ఈ వర్గాలని టీడీపీ పూర్తిగా పక్కన పెట్టేసిన నేపధ్యంలో జగన్ వారిని చేరదీసిన వైనమే ఆయనకు గెలుపు అవకాశాలను పెంచుతోందని అంటున్నారు. ముఖ్యంగా రైతులు ఇపుడు విసిగిపోయి ఉన్నారు. వారికి రుణ మాఫీ జరగలేదు. ఎంతో చేశామని టీడీపీ వూదరగొడుతున్నా జరగలేదన్నది రైతన్న గుండెలకే తెలుసు. వారి కోసం జగన్ ఇస్తున్న హామీలు ఇపుడు  బాగా క్లిక్ అవుతున్నాయి. ముఖ్యంగా రైతులకు భరోసాగా ఏడాదికి 12వేల అయిదు వందల రూపాయలు ఏడాదికి ఒక మారు ఇవ్వడం గొప్ప హామీగా ఉంది. అదే విధంగా రైతుల గిట్టుబాటు ధరల కోసం ఓ ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం కూడా మంచి హామీగా ఉంది.


ఇక యువత పైన జగన్ టార్గెట్ చేశారు. బాబు జమానాలో జాబులు లేక అల్లాడుతున్న వారికి తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకంగా రెండున్న లక్షల ఉద్యోగాలు ఇస్తామని జగన్ చెప్పడంతో ఆ వర్గం వైసీపీ వైపుగా టర్న్ అవుతోంది. అదే విధంగా  డ్వాక్రా మహిళల రుణాల మాఫీ వారికి గొప్ప వూరట. వారికి సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వడం కూడా జగన్ ఇస్తున్న మరో హామీ. ఇక అందరికీ పనికివచ్చే ఉచిత విద్య, బడికి పిల్లలను పంపే వారికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం కూడా మంచి హామీలే. ఇక అన్నింటి కంటే పెద్దగా చెప్పుకోవాలి ఆరోగ్యశ్రీ పధకం. దీంతో జగన్ వైపు భారీ ఎత్తున ఓటర్లు టర్న్ అయ్యేందుకు అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ హామీలే జగన్ని అందలం ఎక్కించేందుకు రెడీగా ఉన్నాయని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: