ఏపీలో రాజకీయం కీలక దశకు చేరుకుంది. మరో వారం రోజులు మాత్రమే ప్రచారానికి వ్యవధి ఉంది. అన్ని పార్టీలు పరుగు పందెంలో జోరుగా ఉన్నాయి. హామీల వరద పారుతోంది. ఓటరన్నను ప్రసన్నం చేసుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. అనేక మసాలాలు  కూడా కలిపి భారీ సినిమాను చూపిస్తున్నారు.


ఇక నిన్న విశాఖలో ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చి మాట్లాడి వెళ్ళారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ విశాఖ వేదికగా బాబుతో కలసి  మోడీని ఘాటుగా విమర్శించారు. మా బాబు బంగారం అన్నారు. అంతవరకూ బాగానే వుంది కానీ విశాఖ జనం మాత్రం పెద్దగా రెస్పాండ్ అవలేదు. ఎందుకంటే వారికి ఏపీ ఎన్నికలకూ పెద్దగా సంబంధం లేదు. వారి పార్టీ ఇక్కడ లేదు. వారికి ఇక్కడ ఎవరితోనూ పొత్తులు లేవు. పైగా వారు జాతీయ నాయకులు అంతకంటే కారు. దాంతో ఆలా వచ్చారు, వెళ్లారు.


ఇపుడు మాయావతి వంతు. ఆమె యూపీకి మాజీ ముఖ్యమంత్రి. ఆమె దళిత నాయకురాలిగా పేరు సంపాదించుకున్నారు కానీ అదంతా ఉత్తరాదికే పరిమితం. ఇంకా చెప్పాలంటే యూపీకే ఆమె పరిమితం. మరి మాయావతితో అనూహ్యంగా జనసేన పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు కూడా ఇచ్చింది. అంతవరకూ బాగానే ఉన్నా బీఎస్పీ కొంత దూకుడుగా ఉన్న రోజుల్లోనే ఏపీలో జెండా పాతలేకపోయింది. ఇపుడు అక్కడ యూపీలో ఉనికి కోసం పోరాటం చేస్తున్న వేళ మాయావతి ఇంపాక్ట్ ఇక్కడ ఏముంటుందన్నది పెద్ద ప్రశ్న. 
అయితే ఆమె రేపు విశాఖలో మీడియా మీట్ పెట్టి, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్లో సభల్లో పాల్గొంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే ఏపీ ఎన్నికల్లో సామాజిక రాజకీయ సమీకరణలు పక్కా క్లారిటీగా ఉన్న వేళ మాయా, మమతలు ఇక్కడకు వచ్చిన పెద్దగా ఉపయోగం లేదన్నది అందరి మాటగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: