ఏపీలో ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్నది ఓ వైపు వివిధ రాజకీయ పార్టీలు సర్వేలు చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో కూడా ఏపీ ఎన్నికలపై ఆసక్తి బాగా ఉంది. ఏకంగా ప్రధాని సైతం ఏపీ ఎన్నికలపై తనదైన నివేదికలు  ఎప్పటికపుడు తెప్పించుకుంటున్నారు.  చంద్రబాబు జాతీయ నాయకుడు కావడంతో ఏపీ ఎన్నికలపై అంతటా ఇంటెరెస్ట్ ఏర్పడుతోంది.


ఇదిలా ఉండగా టీడీపీ ప్రచార సరళి ఓటర్ల మనో భావాలపై ఎప్పటికపుడు సర్వేలు చేయించుకుంటోంది. ఆ సర్వేలపై పార్టీలో  అంతర్గతంగా కూడా చర్చ సాగుతోంది ఎట్టి పరిస్థితుల్లో అధికారం చేజారదని టీడీపీ ధీమాగా ఉంది అంటున్నారు. పార్టీ నాయకులకు కూడా అదే చెప్పి ధైర్యంగా ఉండమంటున్నారు.  ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన పసుపు కుంకుమ, పెంచిన పించన్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు టీడీపీని కాపాడుతాయని గట్టి భరోసాతో ఉందని చెబుతున్నారు.


వైసీపీ గాలి ఎంత ఉన్నా కొన్ని కంచుకోటలు మళ్ళీ టీడీపీనే గెలిపిస్తాయని కూడా ఆ పార్టీ అంచనా వేస్తోంది. ఆ పార్టీ అంచనా ప్రకారం 95 సీట్లకు తగ్గవని అంటున్నారు. అదే సమయంలో  వైసీపీకి 70 వరకూ సీట్లు వస్తాయని టీడీపీ  లెక్కలు వేసింది. మిగిలిన అయిదు సీట్లే జనసేన, ఇతరులకు వెళ్తాయని భావిస్తూందట. అయితే బయటకు మాత్రం 150 సీట్లు వస్తాయని చెప్పుకుంటునట్లుగా తెలుస్తోంది. అయితే వైసీపీకి గతంలో 67 సీట్లు వచ్చాయని, ఇపుడు పెరుగుదల కనుకు ఉంటే అది మూడు సీట్లతో ఆగిపోదని, మ్యాజిక్ ఫిగర్ ని దాటి వస్తుందని కూడా వైసీపీ మరో వైపు అంటోంది. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: