చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు వరాల జల్లు కురిపించారు. రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణ మాఫీ ఇలా చెప్పుకుంటే పోతే ఆ లిస్ట్ పెద్దదిగానే ఉంటుంది. అయితే తీరా ఎన్నికల్లో గెలిచిన తరువాత టీడీపీ ఎన్ని హామీలను నెరవేర్చిందో మనం చూస్తూనే ఉన్నాము. క్షేత్ర స్థాయిలో ప్రజలు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు. 


అయితే బాబు గారు .. మళ్ళీ ఎన్నికలు రావటం తో ఒక్కసారిగా అందరూ గుర్తుకు వచ్చారు. అందరీ మీద వరాల జల్లు కురిపిస్తున్నాడు. ఇప్పటికే కొన్ని నెలల ముందు నిరుద్యోగ భృతి ని ప్రకటించారు. తాజాగా పసుపు కుంకుమ డబ్బులంటూ బాగా హడావిడి చేశారు. అయితే ఈ డబ్బులు క్షేత్ర స్థాయిలో చాలా అవినీతి జరుగుతుందని ఏకంగా రాయచోటి సభలో మాజీ ఎమ్మెల్యే పాల కొండ్రాయుడు మాట్లాడటం సంచలనం రేపింది. 


పాల కొండ్రాయుడు మాట్లాడుతూ పసుపు కుంకుమ మంచి పథకమని కానీ చాలా అవినీతి జరుగుతుందని, లబ్ధిదారులకు అందటం లేదని తప్పడు పేర్లు ఎక్కించి మోసం చేస్తున్నారని చెప్పడంతో చంద్రబాబు వారించారు. చివరికి అతన్ని .. స్టేజి మీద ఉన్న వారు పక్కకు తీసుకెళ్లారు. దీనితో టీడీపీ పథకాలు క్షేత్ర స్థాయిలో ఏ విధంగా అమలు అవుతుందో జనాలకు అర్ధం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: