వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల కోసం గత అయిదేళ్లుగా ప్రతిపక్ష నేతగా ఎంత పట్టుదలతో ఉన్నాడో అందరికీ తెలిసిన విషయమే. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఈయన ప్రతీ రోజూ కనీసం రెండు లేదా మూడు జిల్లాలు పర్యటిస్తూనే ఉన్నారు. ఇప్పటికే పాదయాత్ర చేసి అలిసిపోయిన జగన్ ఇంత ఎండలో ఆయనను చూసేందుకు వచ్చిన అశేష జనసందోహాన్ని ఉద్ధేశించి అందరికీ వినపడేలా మాట్లాడుతారు.

ఎంత మైకులు ఉన్నా ఏం లాభం... గొంతు చించుకోనిదే అక్కడ వాలిన లక్షల ప్రజలకు స్పష్టంగా వినపడవు. ఇలా వరుస పర్యటనలు, సభల వల్ల జగన్ గొంతు బొంగురుపోయినట్లు సమాచారం. కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారు నేడు ప్రచారం నుండి విశ్రాంతి తీసుకుంటున్నారంట. 

అయినా ఈ రోజు అంతా ఖాళీగా ఏమీ కూర్చోకుండా... నేడు ఆయన తదుపరి ఎన్నికల వ్యూహాలపై పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై చర్చించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆపై జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి, ఇప్పటివరకూ జరిగిన ప్రచార సరళిపైనా చర్చించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: