జనసేన పార్టీ వ్యవస్థాపకులు, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విజయవాడ లో వంగవీటి రంగ హత్యావిషయం గూర్చి ప్రస్తావించారు. గొడవలు జరగడానికి కారణాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ ఒక మనిషిని హత్య చేయడం చాలా పెద్ద తప్పు అని పవన్ కళ్యాణ్ అన్నారు. నిరాయుధుడైన వంగవీటి రంగాను చంపడం చాలా అనైతికం అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

నిజంగానే రంగ తప్పు చేసి ఉంటే, ఆయనను శిక్షించేందుకు చట్టాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. తనను ఇంకా కలిచి వేసేది ఏది అంటే ఆయన హత్య జరిగిన తరువాత నెల రోజుల తరువాత అంతా విజయవాడ తగలపడిపోవడం అని పవన్ కళ్యాణ్ అన్నారు. అసలు ఈ విషయంతో సంబంధం లేని ఎన్నో కుటుంబాలు, ప్రతీ కులం వారి నలిగిపోవడం తనకి బాధ కలిగించింది అని ఆయన అన్నారు.

తాను నెల్లూరులో చదివే రోజుల్లో అసలు ఎవరూ తన కులం గూర్చి అడగలేదు అని ఆయన గుర్తు చేసుకున్నారు. అలాగే తాను హైదరాబాద్ లో చదివే రోజుల్లో కూడా తనకి చాలా కాలం వరకు తన కులం తెలియదని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే విజయవాడలో ఎలాంటి పరిస్థితి తనకు కనపడలేదని పవన్ అన్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు నిలిపివేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని ఆయన అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: