రాజకీయాల్లో అందరూ బీద అరుపులు అరుస్తూంటారు. తాము నిక్కచ్చిగా ఉంటామని, నిజాయతీ తమ ప్రాణమని కూడా చెబుతూంటారు. కార్లు, ఏసీలు, భవనాలు, కోట్ల ఆస్తులు అవిడవిట్లో కళ్ళు చెదిరే లెక్కలు ఇవన్నీ కామన్ మాన్ అడగకూడదు. నేతాశ్రీలు చెప్పింది నమ్మాలంతే. పేదవాడు అంటే ఇలా ఉంటారా అనుకోవాల్సిందే.


ఇక చంద్రబాబు గారినే చూడండి...ఆయన చేతికి ఉంగరాలు ఉండవు, వాచీలు ఉండవు, ఆస్తి పాస్తులు మూడేళ్ళ మనవడి కంటే తక్కువ మరి. ఆయన్ని పేదల్లో పేదగా అంతా భావించాలి. మరి కొత్త రాజకీయం అంటూ రంగంలోకి వచ్చిన పవన్ తీరు చూస్తే ఆయన ప్రతీ స్పీచ్ లో చెప్పే మాట ఇదే. తనకు మిగిలిన వారిలా అస్తులు లేవు, కోట్ల రూపాయలు లేవు అని. కానీ పవన్ కి ఎంత ఆస్తి వుందో ఆయన అవిడవిట్లో చెప్పుకొచ్చారు. అది వేరే సంగతి.


ఇపుడు అతి సామాన్యుడుగా పార్టీ పెట్టిన పవన్ మిగిలిన ఇద్దరి మాదిరిగా చార్టర్డ్  ఫ్లైట్లో చక్కర్లు కొట్టడం విమర్శలకు దారితీస్తోంది. ఉదయం ఓ జిల్లాలో  మధ్యాహ్నం ఇంకో ప్రాంతంలో ఇలా చార్టర్డ్  ఫ్లైట్లు ఎక్కుతూ దిగుతూ పవన్ కొత్త రాజకీయమే చేస్తున్నారు. దీని మీద వస్తున్న కామెంట్స్ ఆయన అన్న, నర్శాపురం జనసేన ఎంపీ అభ్యర్ధి నాగబాబు తనదైన శైలిలో  ఘాటుగానే స్పందించారు. చంద్రబాబు  ప్రత్యేక విమానాళ్ళో డిల్లీకి  ప్రభుత్వ సొమ్ముతో అందరినీ తీసుకుని వెళ్ళలేదా అని నాగబాబు ప్రశ్నించారు.


ఇక కళ్యాణ్ బాబు అయితే ఆ మాత్రం చార్టర్డ్  ఫ్లైట్లో తిరగడానికి కోట్ల ఆస్తులు ఉండాలా అని కూడా ప్రశ్నించారు  పైగా పవన్ అభిమానులు వాటిని తెచ్చిపెట్టొచ్చు కదా  అంటూ చెప్పుకున్నారు. మొత్తానికి మేమూ ఎవరికీ  తీసిపోమని చెబుతూనే ఎదురుదాడికి నాగబాబు ప్రయ‌త్నించారనిపిస్తోంది. ఏది ఏమైనా ఎన్నికల్లో ఎవరూ పేదలు కాదు. కోట్లు అటూ ఇటూ మారుతాయంతే.


మరింత సమాచారం తెలుసుకోండి: