అదేంటో తెలుగుదేశం పార్టీకి కేంద్రం అన్నా,  అధికారులన్నా యమ మంటగా ఉంటోందేమో. రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఆంధ్ర ప్రదేశ్ ఒక రాష్ట్రం అని మరచిపోతోందేమో తెలియదు కానీ ప్రతీ దానికీ పేచీలే పెడుతూ వస్తోంది. దాంతో మరో మారు కేంద్ర ఎన్నికల సంఘంతో టీడీపీ యుధ్ధానికి సిధ్ధమైపోయింది.


ఏపీలో ఎన్నికలు సజావుగా జరగడానికి, ఏపీ పోలీస్ యంత్రాంగాన్ని కట్టుదిట్టంగా నడిపించడానికి కేంద్ర ఎన్నికల సంఘం కేకే శర్మను ఎన్నికల అధికారిగా తాజాగా నియమించింది. ఆయన సీనియర్ అధికారి, నిజాయైతీపరునిగా పేరుంది. అయితే ఇలా నియామకం అని ప్రకటించారో లేదో వెంటనే బాబు గారి పార్టీ గగ్గోలు మొదలుపెట్టింది ఆయన మాకు వద్దు అంటూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రబాబు సీఈసీకి ఆఘమేఘాల మేద వినతిపత్రం అందించారు.


ఆయనది ఆరెసెస్ బ్యాక్ గ్రౌండ్ అని, ఆయన కనుక నియమిస్తే తాము ఒప్పుకోమని కూడా చెప్పేస్తోంది. ఇక నిన్నటికి నిన్న ఇంటలిజెన్స్ అధికారి వెంకటేశ్వరరావు బదిలీ విషయంలో నానా యాగీ చేసి హై కోర్టుకు వెళ్ళి మరీ పరువు పోగొట్టుకున్న టీడీపీ మళ్ళీ అదే బాట పట్టింది. ఇక ఏపీ పోలీసులపై వైసీపీ ఫిర్యాదు చేస్తే తప్పు అని గగ్గోలు పెట్టిన టీడీపీ ఇపుడు సీఈసీ నిర్ణయాన్ని సైతం గట్టిగా వ్యతిరేకించడం చూస్తే తాను చేస్తే సంసారం అన్న తీరుల ఉందని సెటైర్లు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: