నారావారి పుత్రరత్నం నారా లోకేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలను విన్నవారికి అలాగే అర్ధమవుతోంది. తాడేపల్లి రూరల్లో లోకేష్ ఎన్నికల ప్రచారం చేశారులేండి.  అసలు లోకేష్ ప్రచారానికి వస్తున్నారంటేనే తెలుగుదేశంపార్టీ నేతలు హడలిపోతున్నారు. ఏప్రిల్ 9 వ తేదీన పోలింగ్ అని, మార్చి 23వ తేదీన కౌంటింగ్ అంటూ ఇప్పటికే ప్రచారంలో చెప్పి నవ్వుల పువ్వులు పూయించారు. తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేయటంతో ఏం చేయాలో తెలీక  తమ్ముళ్ళు బుర్రలు గోక్కున్నారు.

 

ఇంతకీ లోకేష్ చెప్పిందేమిటంటే, మంగళగిరి నియోజకవర్గంలో పోయిన ఎన్నికల్లో గంజి చిరంజీవన్నకు ఇచ్చినట్లుగానే రాబోయే ఎన్నికల్లో తనకు కూడా మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించాలని పిలుపునిచ్చారు. పోటీ చేసేవాళ్ళు మంచి మెజారిటీతో గెలవాలని అనుకోవటంలో తప్పేమీలేదు. అందులోను యువరాజు హోదాలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి మెజారిటీ రావాలన్నది లోకేష్ ఆలోచనగా ఉంది.

 

కానీ చిరంజీవన్నకు మెజారిటీ వచ్చినేట్లుగానే తనకు కూడా రావాలని చెప్పటంలోనే తప్పులో కాలేశారు. పోయిన ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసిన గంజి చిరంజీవి ఓడిపోయారు. వైసిపి అభ్యర్ధి ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో చిరంజీవి 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓడిపోయిన అభ్యర్ధిని పట్టుకుని మెజారిటీతో గెలిచారని లోకేష్ చెప్పటమేంటో ఎవరికీ అర్ధంకాలేదు. దాంతో ఏమి చేయాలో అర్ధంకాక అందరూ మౌనంగా ఉన్నారు. దాన్ని గమనించిన లోకేష్ మళ్ళీ అదే విషయాన్ని రిపీట్ చేస్తు తమ్ముళ్ళను అడిగిమరీ చప్పట్లు కొట్టించుకున్నారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: