విశాఖ జిల్లాలో జనసేనకు విపరీతమైన బలం ఉందని ఓవైపు ప్రచారం సాగుతోంది. పవన్ సామజిక వర్గం ఎక్కువగా ఉన్నారని కూడా అంటారు. ఇక పవన్ సొంతంగా గాజువాకలో పోటీ చేస్తున్నారు. దాంతో ఓ విధమైన హైప్ క్రియేట్ కావాల్సిన అవసరం ఉంది. మరి సరిగ్గా అలాంటి సమయంలో పీక్స్ వెళ్ళాల్సిన ప్రచారం కాస్తా ఇలా అయితే ఎలా..


పవన్ సభలకు జనం లేకపోవడమా. అసలు జనమే కదా పవన్ బలం. పవన్ నడిస్తే చాలు వేలల్లో  జనం పోగు అవుతారు అలాంటిది ఒకటి కాదు రెండు కాదు మూడు పవన్ సభలు విశాఖలో రద్దు అయ్యాయి. చోడవరం, అనకాపల్లి, పెందుర్తిలలో పవన్ సభలు హఠాత్తుగా రద్దు కావడంతో పవన్ అభిమానులు షాక్ తిన్నారు. దానికంటే ఎక్కువ బాధ ఏంటంటే పవన్ మీటింగులు జనం లేక రద్దు అయ్యాయన్నది. దాంతో జనసైనికులు మరింతగా నీరసించిపోయారు


నిజానికి పవన్ సభకు జనం బాగానే వచ్చారట. అయితే సరైన టైమింగ్ ని నిర్వాహకులు చెప్పలేకపోవడంతో ఉదయం నుంచి వచ్చిన వారు మధ్యాహ్నం ఎండల్లో ఉండలేక వెనక్కు వెళ్ళిపోయారు. దాంతో పవన్ సభలకు సాయంత్రం పల్చగా జనం ఉండడంతో పాటు పవన్ కి కూడా టైట్ షెడ్యూల్ ఉండడంతో సభలు రద్దు చేశారని టాక్. అయితే జనం లేకనే పవన్ మీటింగులు రద్దు అయ్యయని రావడంతో ఫ్యాన్స్ ఇబ్బందుల్లో పడ్డారు. ఇక ఇదే విధంగా సభలు రద్దు చేసుకుంటూ పోతే దాని ప్రభావం గాజువాక మీద కూడా పడుతుందని కూడా ఆందోళన చెందుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: