బీజేపీ,  టీడీపీ అంతే ఏపీలో ఇపుడు ఉప్పు నిప్పు లాంటి పరిస్థితి ఉందన్న సంగతి అందరికీ తెలిసందే ఏకంగా దేశ ప్రధాని అని చూడకుండా మోడీ మీద చంద్రబాబు దారుణంగా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఇక మోడీకి వ్యతిరేకంగా బాబు జాతీయ స్థాయిలో   కూటమిని కూడా  రెడీ చేసి పెట్టారు.


అటువంటిది బాబు మీద టీడీపీ నేతలకు ఒక్కసారిగా బాబు మీద ప్రేమ రావాల్సిన అవసరం ఉందా. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మోడీకి తలలో నాలుక అనదగ్గ వారణాసి రామ్ మాధవ్ గుంటూర్లో మీడియాతో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఇపుడు ఆసక్తికరంగా మారాయి. ఏపీలో బాబు పాలన పట్ల ప్రజలకు మోజు తీరిపోయింది. ఆయనకు వ్యతిరేకంగా జనం ఉన్నారు. అయితే బాబుని ఢీ కొట్టే పార్టీ ఏపీలో లేకపోవడమే ఆయన అద్రుష్టమని రాం మాధవ్ చేసిన కామెంట్స్ ఇపుడు సెన్సేషన్ అవుతున్నాయి.


దీన్ని బట్టి మరో మారు బాబు ఏపీలో అధికారంలోకి వస్తారని రాం మాధవ్ చెప్పకుండానే చెప్పేశారని అంటున్నారు. ఇక విశాఖలో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సైతం బాబుని విమర్శిస్తూనే వైసీపీని కూడా ఉతికేసారు. అవినీతి పార్టీ వైసీపీకి అధికారంలోకి వచ్చే అర్హత లేదని ఘాట్ కామెంట్స్ చేశారు. గతంలో ఎవరూ చేయని విధంగా అయాన జగన్ మీద విరుచుకుపడ్డారు. దీని బట్టి చూస్తూంటే కేంద్రంలో బీజేపీకి మళ్ళీ బాబుని దువ్వే అవసరం ఏర్పడిందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అంతే కాకుండా ఏపీలో టీడీపీ గెలుస్తుందన్న సంకేతాలు కూడా వారి వద్ద వున్నాయా అన్న డౌట్లు కూడా పుట్టుకొస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: