గత సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలకు స్వతంత్రంగా పోటీ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా వైసీపీ పార్టీ నీ టార్గెట్ చేస్తూ రాబోతున్న ఎన్నికలలో నాకు ప్రధాన ప్రత్యర్థి పార్టీ జగన్ పార్టీ అని చంద్రబాబు పని అయిపోయిందని తెలుగుదేశం సైకిల్ చైన్ తెలంగాణలోనే ఉడిపోయిందని...సైకిల్ చైన్ తెగిపోయిన సైకిల్ ని చంద్రబాబు ప్రస్తుతం తోలుతున్నారు అంటూ సెటైర్లు వేస్తూ రాబోతున్న అసెంబ్లీ ఎన్నికలలో కచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టి చరిత్ర సృష్టిస్తాం అంటూ ఇటీవల ఎన్నికల ప్రచారాలలో భారీ డైలాగులు కొడుతున్నారు పవన్ కళ్యాణ్.


అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్న కామెంట్లను, డైలాగులను వింటున్న ఏపీ ప్రజానీకం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగు పెడతావో..? లేకపోతే ముఖ్యమంత్రిగా అడుగు పెడతావో? అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు.


గత సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన సమయంలో చంద్రబాబు తప్పు చేస్తే కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి చంద్రబాబు వచ్చాక ఆయన ప్రభుత్వం పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా గట్టిగా నిలదీసిన సందర్భాలు లేవని...ఇంతటి వైఖరి కలిగిన కళ్యాణ్ బాబు అసెంబ్లీలో అడుగు పెట్టిన ఒకటే లేకపోయినా ఒకటే అని మరికొంతమంది ఏపీ లో ఉన్న ప్రజలు కామెంట్లు చేస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: