తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్షతో పాటు 40లక్షల జరిమానా కూడా హైదరాబాద్ ఎర్రమంజిల్ న్యాయస్థానం వారు విధించారన్న వార్త కలకలం రేపిన సంగతి అందరికీ తెలిసినదే. ఇదిలా ఉండగా తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మోహన్ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా క్లారిటీ కూడా ఇచ్చేసారు.గతంలో తన కుమారుడు మంచు విష్ణుతో వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో “సలీం” చిత్రం దర్శకత్వం తెరకెక్కిన సంగతి తెలిసినదే.

ఆ సమయంలో మోహన్ బాబు ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యి చెల్లలేదని వైవీఎస్ కేసు పెట్టగా దానికి ఈ రోజు వచ్చిన తీర్పుపై కలెక్షన్ కింగ్ ఇప్పుడు ఒక క్లారిటీ ఇచ్చారు. ఇవన్నీ తప్పుడు సమాచారాలు అంటూ కొట్టిపడేసారు మోహన్ బాబు.వారు సలీం సినిమా చేస్తున్న సమయంలో ఆ సినిమా కొరకు చెల్లించాల్సిన మొత్తం వైవీఎస్ కు చెల్లించేసామని, ఆ తర్వాత కూడా ఆయన దర్శకత్వంలోనే మరో సినిమా చేద్దామనుకున్నామని అందుకు గాను ఒక 40 లక్షల రూపాయల చెక్ ఇచ్చామని అన్నారు. అయితే సలీం సినిమా అనుకున్న స్థాయి ఫలితాన్ని అందుకోకపోడంతో ఆ తర్వాత వారు అనుకున్న ప్రాజెక్ట్ ఆపేద్దామని చెప్పేసాం అంటూ ఆయన వివరణ ఇచ్చారు.

అలాగే ఆ చెక్ కూడా బ్యాంకులో వెయ్యొద్దని వైవీఎస్ కు తెలిపామని కానీ ఆయన వినకుండా బ్యాంకులో వేసి చెక్కు చెల్లదంటూ తమపై తిరిగి కేసు వేసారని తెలిపారు.దీనితో వారికి అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా చేసి కేసును తప్పుదోవ పట్టించారని ఆరోపణ చేసారు. ఆ తీర్పుని తాము సెష‌న్స్ కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం. కొన్ని చానెల్స్‌లో తమపై వస్తున్నటువంటి ఆరోపణలు ఎవరు నమ్మొద్దు అంటూ మోహన్ బాబు ఒక సూపర్ క్లారిటీ ఇచ్చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: