రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. టీడీపీ, వైకాపా, జనసేనలు హోరా హోరీ తలపడుతున్నాయి. టీడీపీ, వైకాపాలు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. మూడో పార్టీ జనసేన అయితే ఇరు పార్టీల మీదా నిప్పులు చెరుగుతోంది. కానీ టీడీపీ, వైకాపాల్లో ఏ ఒక్కటీ కూడా జనసేనను ప్రధాన ప్రత్యర్థిగా పరిగణించడంలేదు. అయితే రాజకీయ ఆసక్తి రెండు ప్రధాన పార్టీల మధ్యే ఉంది.

జనం సైతం పోటీ మొత్తం టీడీపీ, వైకాపాల నడుమే ఉంటుందని, వారిద్దరే ఒకరికొకరు ప్రత్యర్థులని భావిస్తున్నారు. అయితే పవన్ మాత్రం తన ప్రధాన ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే అని తేల్చి చెప్పేశారు. 2018లో తన ప్రత్యర్థి టీడీపీ అని అనుకున్నానని, కానీ ఇప్పుడు మాత్రం వైకాపానే ప్రధాన ప్రత్యర్థి అంటున్నారు. ఎందుకంటే టీడీపీ సైకిల్ చైన్ కేసీఆర్ ఎప్పుడో తెంచేశాడు. ఇక అది నడవదు. నడవని పార్టీని ఎన్నని ఏం లాభం.

ఇప్పటికే అనాల్సినవన్నీ అనేశాను అంటూ వివరణ ఇచ్చారు. ఇరు పార్టీలు జనానికి అమలుపరచడానికి వీలులేని హామీలిచ్చి మోసం చేస్తున్నాయని, జనసేన మాత్రమే మధ్యతరగతి మనిషికి అవసరమైన, ఆచరణసాధ్యమైన హామీలు ఇస్తోందని అన్నారు. తాను జీవిత కాలం పార్టీని నడపాలనుకుంటున్నానని, రాబోయే ఎన్నికలు తనకు ఒక దఫా ఎన్నికలు మాత్రమేనని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: