టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు జాతీయ నేల‌ను ఏపీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌రుస‌బెట్టి తీసుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో కీల‌క‌మైన పార్టీ ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ). దాదాపు మూడు, నాలుగు నెల‌ల క్రిత‌మే ఈ విష‌యాన్ని వీడియోటో ప్రొజెక్ట్ చేశారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌తో స‌హా మాయావతి, మ‌మ‌తా బెన‌ర్జీ ఇటువంటి వారితో సంబంధాల‌ను నెర‌ప‌డం ద్వారా ఏపీలో ఉన్న‌టువంటి త‌న ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను క‌వ‌ర్ చేసుకునేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

ఆ విధ‌మైన‌టువంటి టెక్నిక్‌లో చంద్ర‌బాబు విజ‌యంత‌మ‌య్యారు. ఇప్ప‌టికే సంక్షేమ ప‌థ‌కాల ప‌రంగా, హామీల‌ను గుప్పిస్తూ, ఇంకోవైపు ప్ర‌త్య‌ర్ధుల‌కు సంబంధించి త‌న అనుకూల మీడియాతో దెబ్బ తీస్తున్న‌టువంటి చంద్ర‌బాబు ఎత్తు గ‌డ‌ల్లో తాజాగా క‌న‌ప‌డే పార్టీ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ.అయితే, ఆమ్ ఆద్మీ పార్టీకి ఏపీలో ఓట్లు లేక‌పోవ‌చ్చు కానీ, లోక్‌స‌త్తా ఓట‌ర్లు, ఆమ్ ఆద్మీ పార్టీ ఓట‌ర్లు, దాదాపుగా మూడు నుంచి ఐదుశాతం ఓట‌ర్లు త‌ట‌స్థులుగా ఉంటారు. వారిలో ఎక్కువ మంది విద్యావంతులే ఉంటారు. బాధ్య‌త‌గల రాజ‌కీయ పార్టీకే ఓటు వేయాల‌ని వారు నిర్ణ‌యించుకుని ఉంటారు. స్థానిక అభ్య‌ర్ధి ఎవ‌రు?రాజ‌కీయ పార్టీల సిద్ధాంతాలు ఎలా ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో లోక్‌స‌త్తా ఈ సారి పోటీ చేయ‌న‌టువంటి సంద‌ర్భంలో ఓట‌ర్లు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు వెళ‌తార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావించారు. కానీ, ఆమ్ ఆద్మీపార్టీ ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లోనే ఆమ్ ఆద్మీ ప‌రిమిత‌మ‌వ‌డంతో ఆ పార్టీ అధినేత‌నే ప‌ట్టుకొస్తే, ఆ త‌ట‌స్తుల ఓట్లు మూడు నుంచి ఐదుశాతం వ‌ర‌కు తాను పొందొచ్చ‌ని భావించిన చంద్ర‌బాబు ప్లాన్‌కు కేజ్రీవాల్ స‌హ‌క‌రిస్తున్నారు. ఆ ఐదుశాతం ఓట్లు చంద్ర‌బాబుకు యాడ్ అయితే, అది జ‌గ‌న్‌కు మైన‌స్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: