రాజకీయాల్లో రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు ఉంటాయి. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయవచ్చు. ఒకటి కాదు, రెండు స్థానాల్లో కూడా పోటీకి దిగవచ్చు. గతంలో అయితే మూడు సీట్లకు కూడా పోటీ చేయవచ్చని ఉండేది. దాన్ని సవరించారిపుడు. ఈసారి కాంగ్రెస్ యువ రాజు రాహుల్ గాంధి రెండు లోక్ సభ సీట్లకు పోటీ చేస్తూంటే ఏపీలో పవన్ రెండు అసెంబ్లీ సీట్లలో తలపడుతున్నారు.


రెండు సీట్లకు పోటీ వల్ల ప్రయోజనాలతో పాటు, కొన్ని అనర్ధాలు కూడా ఉన్నాయి. వాళ్ళు గెలిపిస్తారని వీరు, వీరు గెలిపిస్తారని వారు ఓడించే చాన్స్ కూడా ఉంది. ఇక గెలిచిన తరువాత ఏది ఉంచుకుంటారో తెలియక ఓడించేసేవారూ ఉంటారు. సరే ప్రజాదరణ ఉంటే ఈ లెక్కలేవీ పట్టించుకోనవసరం లేదు. కానీ పవన్ ఏపీలో రెండు సీట్ల పోటీ మాత్రం ఆసక్తికరంగానే ఉంది ఆయన గాజువాక, భీమవరం సీట్లను ఎంచుకున్నారు.  దీని మీద విశాఖలో మీడియా సమావేశంలో ఓ బలమైన ప్రశ్నను పవన్ ఎదుర్కొన్నారు. 


రెండు సీట్లకు పోటీ చేసి ఒకటి రాజీనామ చేసే ప్రజా ధనం వ్రుధా కదా. నీతులు చెప్పే మీలాంటి వారు ఇలా  పోటీ చేయడం తగునా అన్ని మీడియా డైరెక్ట్ గానే అడిగేసింది. దానికి పవన్ ఇచ్చిన సమాధానం ఎదురుదాడినే తలపించింది. ఏపీలో పుష్కరాల ఖర్చుల పేరుతో వందల వేల  కోట్ల రూపాయలు తగలేశారు, మరో వైపు విపక్ష నేత వేల కోట్లు ప్రజాధనం దోచుకున్నారు. వాటితో పోలిస్తే ఉప ఎన్నిక వల్ల ఖర్చు పెద్దదేమీ కాదు అంటున్నాడు పవన్. మొత్తానికి పవన్ తనని సమర్ధించుకోవడానికి  తానూ ఆ తానులో ముక్కేనని చెబుతున్నారా అన్న డౌట్లు పుట్టుకొస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: