క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనుమానం వస్తోంది. అందుకనే ముందుజాగ్రత్తగా ప్రజాశాంతిపార్టీ ఎన్నికల చిహ్నాన్ని మార్చాలంటూ మొత్తుకున్నది. అయితే ఎన్నికల కమీషన్ వైసిపి డిమాండ్ ను కొట్టేసిందనుకోండి అది వేరే సంగతి. ప్రజాశాంతి పార్టీ చిహ్నం హెలికాప్టర్ గుర్తు  వైసిపి ఎన్నికల చిహ్నం ఫ్యాన్ ను పోలి వుందని వైసిపి నేతలు మొత్తుకుంటున్నారు.

 

ఎన్నికల చిహ్నంతోనే ఇబ్బందని వైసిపి నేతలు మొత్తుకుంటుంటే చాలా చోట్ల అభ్యర్ధుల పేర్లు కూడా దాదాపు ఒకేలా ఉండటం మరింత షాక్ కు గురిచేసేందనటం సందేహం లేదు.  సుమారు 39 నియోజకవర్గాల్లో తమ అభ్యర్ధుల పేర్ల లాంటివే ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధుల పేర్లున్నాయని వైసిపి ఆరోపిస్తోంది. రెండు పార్టీల పేర్లు దాదాపు ఒకేలా ఉండటం ఎంతమాత్రం యాధృచ్చికం మాత్రం కాదు. ఆ విషయం తెలిసినా వైసిపి నేతలు ఏమీ చేయలేని పరిస్ధితుల్లో ఉన్నారు.

 

ఉదాహరణకు గుడివాడలో వైసిపి అభ్యర్ధి పేరు వెంకటేశ్వరరావు కొడాలి అయితే ప్రజాశాంతిపార్టీ అభ్యర్ధి పేరు కూడా వెంకటేశ్వరరావు కొడాలినే. రాజోలులో వైసిపి అభ్యర్ధి బొంతు రాజేశ్వరరావు. ప్రజాశాంతిపార్టీ అభ్యర్ధి పేరు కూడా బొంతు రాజేశ్వరరావే. కైకలూరులో దూలం నాగేశ్వరరావు వైసిపి నుండి పోటీచేస్తుంటే పాల్ పార్టీ అభ్యర్ధి పేరు దాసి నాగేశ్వరరావు. ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైసిపి నుండి పోటీ చేస్తుంటే ప్రజాశాంతిపార్టీ తరపున పి. వెంకటరామిరెడ్డి పోటీలో ఉన్నారు.

అభ్యర్ధుల పేర్లు దాదపు ఒకేలా ఉండటంతోనే వైసిపి నేతలు చంద్రబాబునాయుడుపై ఆరోపిస్తున్నారు. తమ అభ్యర్ధుల విజయావకాశాలను దెబ్బకొట్టటానికి పాల్ తో కుమ్మకై చంద్రబాబే అభ్యర్ధులను పోటీ పెట్టినట్లు ఆరోపిస్తోంది. పై రెండు కారణాలతో వైసిపి ఓట్లకు గండిపడే అవకాశాలున్నాయి. రేపటి ఎన్నికలు చాలా టైట్ ఫైట్ తో నడుస్తోంది. ఎవరు గెలిచినా పెద్దగా ఓట్ల తేడా ఉండే అవకాశం లేదు. అటువంటపుడు వందల ఓట్లు కూడా ఫలితాన్ని మార్చేసే అవకాశం ఉంది. వృద్ధులు, గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులు గుర్తుల దగ్గర పొరపాటుపడే అవకాశాలున్నాయని వైసిపి భయపడుతోంది.


మొన్నటి తెలంగాణా ఎన్నికల్లో జరిగిందదే. టిఆర్ఎస్ ఎన్నికల చిహ్నం కారు. అయితే కొందరు అభ్యర్ధులకు ట్రక్కు, ఆటోలను ఎన్నికల చిహ్నాలుగా ఎన్నికల కమీషన్ కేటాయించింది. దీనిపై టిఆర్ఎస్ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. తీరా ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత టిఆర్ఎస్ భయమే నిజమైంది. దాదాపు 30 నియోజకవర్గాల్లో ట్రక్, ఆటో అభ్యర్ధులకు వేలల్లో ఓట్లు పడ్డాయి. టిఆర్ఎస్ అభ్యర్ధుల ఓడిపోయిన ఓట్ల తేడాకన్నా ట్రక్కు, ఆటో చిహ్నాలకు పడిన ఓట్లే చాలా ఎక్కువ. కాబట్టి చిహ్నం, పేర్ల గుర్తులతో వైసిపి జాగ్రత్తగా ఉండకపోతే దెబ్బ పడటం ఖాయమనే అర్ధమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: