ఆంధ్ర ప్రదేశ్ లో రానున్న ఎన్నికలకు సంబంధించి జోరుగా జరుగుతున్న పందేలు, సర్వేలు మరియు కలకలం రేపుతున్న బుకీల గురించి ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారు ముఖాముఖిలో లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ముందుగా ఈ బుకీల గొడవ ఏంటి అసలు అని ఆయనను ప్రశ్నించగా.... పోరు రసవత్తరంగా ఉన్న సమయంలోనే ఇలాంటి పందేలు జరుగుతాయని, లేని పక్షంలో వీటికి ఎటువంటి ఆస్కారం ఉండదని ఆయన అన్నారు. 


తెలంగాణ పార్లమెంటు ఎన్నికలకి సంబంధించి ఎలాంటి సర్వేలు, పందేల పైన ఆసక్తి లేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆంధ్రలో పొలిటికల్ వేవ్ పలానా పార్టీకి పూర్తిగా అనుకూలంగా లేని కారణంగా ఇలాంటి సర్వేలు, బుకీల జోరు ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. ఇప్పుడు ప్రధాన సర్వేలు ఇచ్చిన రిపోర్టు లేదా తనలాంటి పొలిటికల్ అనలిస్ట్ లు చెప్పిన అంచనాలో రెండు పార్టీలకు సమానావకాశాలు ఉన్నా కూడా, ఆయా పార్టీలు తమకు అనుకూలంగా ఉండే భాగాలను ఎడిట్ చేసి సర్క్యులేట్ చేసుకోవడమే ఇలాంటి పందేలకు దారితీస్తుందని స్పష్టం చేశారు.


ఇక పోతే ఇప్పుడే రాష్ట్రంలో ఏ పార్టీ పై చేయి సాధిస్తుంది అని కచ్చితంగా చెప్పలేని మూలాన ఈ బుకీల జోరు అధికంగా ఉంటుందని ఆయన అన్నారు. ఇప్పుడొస్తున్న సర్వేలు, వాటి రిజల్ట్ ప్రాంతాల వారీగా మారుతుంది అని ఆయన అన్నారు. ఈస్ట్ గోదావరి లో ఉన్న వాతావరణం పశ్చిమ గోదావరిలో ఉండదు అని, అలాగే ఇప్పుడు వస్తున్న సర్వేలు కచ్చితంగా ఒక నియోజకవర్గం నుండి మరొక నియోజకవర్గానికి మారుతుందని కాబట్టి పోరు 2014 లో లాగా ఈ సారి చాలా హోరాహోరీగా ఉందని ఆయన అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: