గతంలో ఎప్పుడూ లేనంతగా అధికారం కోసం ఇటు చంద్రబాబునాయుడు అటు జగన్మోహన్ రెడ్డి బాగా శ్రమిస్తున్నారు. అధికారాన్ని నిలబెట్టుకోవటానికి ఒకరు, మొదటిసారి అందుకోవటానికి మరొకరు. ఎంతైనా అధికారంలో ఉన్న చంద్రబాబుకే  కొన్ని పరిస్ధితులు అనుకూలంగా ఉంటాయనటంలో సందేహం లేదు. అయితే క్షేత్రస్ధాయిలో పరిస్దితులు మాత్రం జగన్ కే అనుకూలంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అందుకనే చంద్రబాబు ముందుజాగ్రత్తగా మూడు ప్లాన్లను సిద్ధం చేసుకున్నారట. 


ఇంతకీ చంద్రబాబు సిద్ధం చేసుకున్న మూడు ప్లాన్లు ఏమిటో చూద్దాం. మొదటిది ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది. రెండోది పోలింగ్ కేంద్రాల్లో ఉండే ఏజెంట్లు. మూడోది కౌంటింగ్ అప్పుడు విధుల్లో ఉండే సిబ్బది ప్లస్ ఏజెంట్లు. అవసరమైతే నాలుగో ప్లాన్ కూడా సిద్ధంగా ఉంచుకున్నారట లేండి. ఎన్నికల విధుల్లో ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్ధల సిబ్బందిని కూడా ఉపయోగించుకోవటం అందరికీ తెలిసిందే. ఇక్కడే చంద్రబాబు మొదటి ప్లాన్ మొదలుపెట్టారు.

 

మొదటి ప్లాన్ లో భాగంగా  ఎన్నికల విధుల్లో ఉండేవారిలో వీలైనంత వరకూ తనకు అనుకూలంగా ఉండే వారినే చూసుకున్నారు. ఎన్నికల్లో సుమారుగా 4 వేల సిబ్బంది వరకూ అవసరం. పేరుకి మాత్రమే వాళ్ళంతా ఎన్నికల కమీషన్ పరిధిలోనే పనిచేస్తారు. నిజానికి వాళ్ళంతా చంద్రబాబు లేకపోతే అధికార పార్టీ చెప్పినట్లు వినేవాళ్ళే. అలాంటి వాళ్ళనే చంద్రబాబు ఏరికోరి ఎన్నికల కమీషన్ పరిధిలోకి పంపారట.

 

అందుకు ఉదాహరణ గుంటూరు జిల్లానే.  జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో భాగంగా పోలింగ్ కోసం ఎంపిక చేసిన సిబ్బందిలో  70 శాతం టిడిపి నేతలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారట. ఆ విషయంలో వైసిపి నేతలు గగ్గోలు పెట్టేస్తున్నారు. ఎన్నికల కమీషన్ కు ఆధారాలతో సహా ఇచ్చారు. టిడిపి నేతలకు చెందిన విద్యాసంస్ధల్లోని సిబ్బందినే పోలింగ్ కేంద్రాల్లో డ్యూటీలో వేశారు.  వీరందరినీ డ్యూటీ నుండి వైసిపి నేతలు తప్పించగలరా ?

 

ఇక రెండో ప్లానేమిటంటే పోలింగ్ కేంద్రాల్లో ఉండే ఏజెంట్లను ఏదో  ఓ రకంగా లోబరుచుకోవటం. కేంద్రాల్లో టిడిపి, జనసేన, ప్రజాశాంతిపార్టీ, వామపక్షాల ఏజెంట్లు దాదాపు ఒకటిగా ఉండే అవకాశం ఉంది. వాళ్ళందరినీ వైసిపి ఏజెంట్లు ధీటుగా ఎదుర్కోవాలి. అందరూ ఏకమై వైసిపి ఏజెంట్ నోరు నొక్కే అవకాశం లేకపోలేదు. మూడోది కౌంటింగ్ కేంద్రాల్లో కూడా తమ మాట వినే సిబ్బందినే డ్యూటీలో ఉండేట్లు చూసుకోవటం. అదే సమయంలో ప్రత్యర్ధి పార్టీల కౌంటింగ్ ఏజెంట్లను కూడా లోబరుచుకోవటం.


వీటన్నింటినీ దాటుకుని జగన్ ముందుకు వచ్చారనుకోండి అప్పుడు నాలుగో ప్లాన్ అమలు చేస్తారట. అదేమిటంటే, గెలుపుకు అవసరమైన సీట్ల సంఖ్య కాస్త అటు ఇటుగా వస్తే వైసిపి ఎంఎల్ఏలను లాగేసుకోవటమట. ఎలాగు ప్రలోభాలు పెట్టటంలో, బేరాలాడటంలో చంద్రబాబుకు బాగానే అనుభవముంది. కాబట్టి అదే పద్దతిని అమలు చేయటానికి రెడీగా ఉన్నారట. ఒకవేళ జగన్ కు పూర్తి మెజారిటీ వస్తే అప్పుడు చంద్రబాబుకు చేయటానికి ఏమీ ఉండదనుకోండి అది వేరే సంగతి.


మరింత సమాచారం తెలుసుకోండి: