ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ రాబోతున్న సార్వత్రిక ఎన్నికలలో గెలవాలని చూస్తున్నారు అంటూ ఇటీవల వైసీపీ పార్టీకి చెందిన నేతలు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తో చంద్రబాబు రాబోయే ఎన్నికలలో అక్రమాలకు పాల్పడుతున్నారని న్యాయస్థానానికి వెళ్లి వైసిపి పార్టీ ఎన్నికల విధుల నుండి ఏబీ వెంకటేశ్వరరావు నీ తప్పించడం జరిగింది.


ఈ క్రమంలో ఏబీ వెంకటేశ్వరరావు తో పాటు కడప, శ్రీకాకుళం ఎస్పీలపై ఈసీ వేటువేసిన విషయం తెలిసిందే. వారిని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేసింది. అయితే ఎస్పీలను బదిలీ చేసినా, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ప్రత్యేక జీఓ జారీ చేయడం వివాదానికి దారితీసింది.


ఈ క్రమంలో వైసిపి పార్టీకి చెందిన నేతలు వేసిన పిటిషన్ పై కోర్టులో వాద ప్రతివాదన తర్వాత ఈసీ ఆదేశాలను శిరసావహించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేయడంతో ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు బదిలీ ఉత్తర్వు ఇచ్చింది. అయితే ఇప్పటికీ వెంకటేశ్వరరావు అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. కింది స్థాయి ఉద్యోగులకు నివేదికలు ఇస్తున్నారని పేర్కొన్న పిటిషనర్‌ ఇంటెలిజెన్స్‌ విధుల్లో కలుగజేసుకోకుండా, ఆయన ఇచ్చిన నివేదికలను పరిగణనలోకి తీసుకోకుండా చూడాలని కోరారు.


పిటిషన్‌ స్వీకరించిన కోర్టు విచారణను సోమవారానికి వాయిదావేసింది. దీనికి సంబంధించిన పిటిషన్ను వైసిపి పార్టీకి చెందిన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి ఇటీవల న్యాయస్థానంలో దాఖలు చేశారు. మరోపక్క ఈ విషయంపై రాష్ట్రంలో ఉన్న మేధావులు రాజకీయ విశ్లేషకులు న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేసిన విన లేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందని ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమైన పరిణామమని కామెంట్లు చేస్తున్నారు.


 



మరింత సమాచారం తెలుసుకోండి: