ఒక్క చాన్స్ ఇపుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏపీ రాజకీయాలు ఎన్నడూ లేనంతగా భీకరమైన పోటీతో సాగుతున్నాయి. అంతా అనుకున్నట్లుగా ఏపీలో  త్రిముఖ పోటీ అన్నది వట్టి మాటగా తేలిపోయింది. ఒకటి రెండు జిల్లాలు తప్ప  2014 ఎన్నికల మాదిరిగానే టీడీపీ వర్సెస్ వైసీపీ గా గట్టి పోటీ సాగుతోంది.


ఈ నేపధ్యంలో వైసీపీ అధినేత ఒక్క చాన్స్ అంటూ  జనం ముందుకు వచ్చారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, ఏపీకి గొప్ప పాలన అందిస్తానని ఆయన చెప్పుకుంటున్నారు. 2004 ఎన్నికల్లో తన తండ్రి వైఎస్సార్ కి ఒక్క చాన్స్ ఇచ్చారని, ఆయన ఎవరూ   వూహించని విధంగా కనీ వినీ ఏరుగని తీరుల పాలన చేశారని జగన్ గుర్తు చేస్తున్నారు. తనకు కూడా జనం ఆదరిస్తే అద్భుతాలు స్రుష్టిస్తానని ఆయన హమీ ఇస్తున్నారు.


జగన్ ఇలా అన్నాడో లేదో ఇదే ఇపుడు టీడీపీకి ఆ మాటే  తారక మంత్రం అయిపోయింది ఒక్క చాన్స్ ఎందుకు ఇవ్వాలంటూ టీడీపీ నేతలు విరుచుకుపడిపోతున్నారు. చంద్రబాబు మొదలు కార్యకర్త వరకూ ఒక్క చాన్స్ అంటే మరణమే, ఆత్మ హత్యలే, విషం తాగడమే అంటూ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఒక్క్ చాన్స్ ఇవ్వడానికి ఇదేమైన చాక్లెట్  నా తమ్ముళ్ళూ అంటూ చంద్రబాబు తన సభల్లో వెటకారం ఆడుతున్నారు.


ఐతే ఒక్క చాన్స్ అన్న మాటకు టీడీపీ నేతలు ఎందుకిలా ఉలిక్కిపడుతున్నారంటే జనంలో ఈ మాట బాగా వెళ్ళిపోయింది. ముఖ్యంగా గ్రామీణంలో  పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. పోనీ ఈసారికి అవకాశం జగన్ కి ఇద్దామా అన్న ఆలోచన క్రమంగా పెరుగుతోంది. దీంతోనే పసుపుదళంలో కలవరం పెరిగిపోతోందట.
 మొత్తానికి జగన్ ఎన్నికల ప్రచారంలో తీసుకున్న గొప్ప నినాదం ఒక్క చాన్స్ ఇపుడు ఏపీవ్యాప్తంగా ప్రకంపనలు స్రుష్టిస్తోంది. జనంలోకి బాగా వెళ్ళిపోయినా ఈ రెండు  పదాల మాటను తుడిచేందుకు టీడీపీ గట్టిగా క్రుషి చేస్తోంది. మరి సక్సెస్ అవుతుందా లేదా తొందరలోనే తేలిపోనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: