జనసేనాని ఎన్నికల వేళ రాజకీయల స్పీడ్ పెంచారు. ఇన్నాళ్ళూ పార్ట్ టైం పాలిటిక్స్ చేసినా ఇపుడు  ఎన్నికల ప్రచారంతో పాటు వ్యూహాలకు కూడా బాగానే  పదును పెడుతున్నారు. పదునైన మాటలను కూడా వదుల్తున్నారు. తాను కూడా ఫక్త్ పొలిటీషియన్ అవతారం ఎత్తేశారు. కొత్త నినాదాలు అందుకుంటున్నారు.


తాను రెల్లిని అంటూ పరిచయం చేసుకున్న్నారు జనసేనాని విశాఖ సభల్లో. తన కులం అదేనని అంటానని ఆయన చెప్పుకున్నారు. ఎందుకంటే వారు చెత్త వూడుస్తారు, తాను రాజకీయాల్లో చెత్తను వూడుస్తానని ఆయన సరిపోల్చుకున్నారు. పైగా దళితులు అంటే తనకు గౌరవం అని కూడా అన్నారు.  గత రెండు రోజులుగా పవన్ మాటలు ఇదే తీరుగా ఉంటున్నాయి. బీఎస్పీ నాయకురాలు మాయావతితో కలసి ఏపీలో ప్రచారం చేసిన పవన్ దళిత కార్డ్ బయటకు తీశారు.


పనిలో పనిగా జగన్ని దళితులతో ముడిపెట్టి ఘాటు విమర్శలు చేశారు. పులివెందులలో దళితులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని విమర్శలు చేశారు. జగన్ కి దళితుల ఓట్లు కావాలి కానీ వారి  బాగోగులు పట్టవని కూడా అన్నారు. ఇన్ని చెప్పిన పవన్ చంద్రబాబు విషయం మరచిపోయారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అంటూ బాబు చేసిన దాని మీద ఒక్క మాట కూడా అపుడూ ఇపుడూ మాట్లాడని పవన్ జగన్ మీదనే బాణాలు వదులుతున్నారు.


నిజానికి జగన్ కుటుంబంలో  వారు  దళితులను కులాంతర వివాహం చేసుకున్నారు. వారు ఆచరణలో  దళిత సమానత  చేసి చూపించారు. వైసీపీకి దళితులు అండగా ఉంటున్నారు. జగన్ సైతం వారిని సమాదరిస్తున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్ధుల ప్రకటన దళిత ఎంపీ అభ్యర్ధి నందిగం సురేష్ ను పక్కన కూర్చోబెట్టుకుని చేసి చూపారు జగన్ అని చెబుతున్న  వైసీపీ నేతలు పవన్ మాటలపై మండిపడుతున్నారు. 
ఓట్ల కోసం ఏ ఎండకు ఆ గొడుగు పవన్ పడుతున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.  నిజంగా పవన్ కి  కుల్లాల మీద ప్రేమ లేకపోతే , కాపులు ఎక్కువగా ఉన్న చోట్ల పోటీ  చేయడమేంటి అని కూడా నిలదీస్తున్నారు. మరి రాజకీయ‌ జీవిగా పూర్తిగా  మారిన పవన్ వీటికి సమాధానాలు చెబుతారా.


మరింత సమాచారం తెలుసుకోండి: