ఏపీలో దాదాపుగా పాతిక మంది వరకూ మంత్రులు ఉన్నారు. వారంతా ఇపుడు ఎన్నికల వేడిలో కిందా మీదా పడుతున్నారు. మంత్రులు ఎక్కడా ప్రచారంలోకి తొంగి చూడడంలేదు. వంగి వాలడంలేదు. మంత్రులు ఎంత బిజీ అయిపోయారంటే ఎక్కడి వారు గప్ చిప్ అన్నట్లుగా అమాత్యుల తీరు ఉంది.


మంత్రి అంటే కనీసం జిల్లాలో పార్టీని గెలిపించేందుకు సాయం చేయాలి. చంద్రబాబు ప్రతి జిల్లాకు ఒక మంత్రిని, పెద్ద జిల్లాలకు రెండేసి, మూడేసి మంత్రి పదవులు ఇచ్చారు. మరి ఆ మంత్రులు ఇపుడేం చేస్తున్నారంటే తమ సొంత నియోజకవర్గంలో గెలవడానికి చమటోడుస్తున్నారనే చెప్పాలి. ఉత్తరాంధ్రలో మంత్రులు అంతా సీనియర్లు, అయినా వారు తమ గెలుపు కోసం నానా కష్టాలు పడుతున్నారు. పక్క చూపులు అసలు చూడడంలేదు.


ఇక శ్రీకాకుళంలో ఏకంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకటరావు ఉన్నారు. నిజానికి ఆయన ఏపీలో పార్టీ బాధ్యతలను భుజానికి ఎత్తుకోవాలి కానీ మంత్రులు అంతా తమ సీటు లో గెలిచేందుకే గట్టిగా పనిచేస్తున్నారు. అంటే టీడీపీలో మంత్రుల ప్రచారం పూరిగా లేనట్లేననిపిస్తోంది. దీని మీద టీడీపీ అభ్యర్ధులు పలు చోట్ల గుస్సా అవుతున్నారు
 జిల్లాను శాసిస్తామని చెప్పుకున్న  మంత్రులు తమ గెలుపు మాత్రమే చూసుకోవడమేంటని, కనీసం పక్క జిల్లాలో ప్రచారం కూడా చేయలేరా అంటూ మండిపడుతున్నారు. అయితే వారికేం తెలుసు, మంత్రులు చాల చోట్ల తమ సీట్లోనే ఎదురీదుతున్నారని. మొత్తానికి ఈ సీన్ కూడా ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనడానికి ఓ ఉదాహరణగా చూడాలని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: