దేశ వ్యాప్తంగా ఎన్నికల జోరు కొనసాగుతుంది.  నేతలు మొన్నటి వరకు ప్రచారాలతో కాకెత్తించారు. ప్రస్తుతం సైలెంట్ గా ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు.  ఓటర్ల లీస్టులు తీసుకొని తమపార్టీకే ఓటు వేయాలని డబ్బు, నగలు, వస్తు రూపేణ ఇస్తున్నారు.  అయితే ఇందుకోసం అయ్యే ఖర్చు రక రకాల మార్గాల ద్వారా తరలిస్తున్నారు.  అయితే ఎన్నికల నేపథ్యంలో ఏపి తెలంగాణ సరిహద్దుల్లో ముమ్ము తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. 

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కోట్లల్లో డబ్బు స్వాధీన పరుచుకుంటున్నారు పోలీసులు.  ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో రూ.3.29కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్‌ జహీరానగర్‌ నుంచి రోడ్డు నంబరు.14 వైపు డబ్బు తరలిస్తున్నారన్న సమాచారంతో ఇన్‌స్పెక్టర్‌ కళింగరావు, డీఐ రవికుమార్‌, ఎస్‌ఐ శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలోని బృందం నిఘా పెట్టింది.  పక్కా సమాచారం అందుకున్న పోలీసులు  ద్విచక్ర వాహనంపై సంచితో వెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసులు నిలిపి తనిఖీ చేయగా.. సంచిలో రూ.కోటి నగదును గుర్తించారు.   

అతడిని తమదైన శైలిలో ప్రశ్నించగా నిజం చెప్పాడు. ఆ డబ్బు  జహీరానగర్‌లో ఉండే నగల వ్యాపారి అనిల్‌కుమార్‌ అగర్వాల్‌కు చెందిన నగదుగా తెలిసింది. వెంటనే పోలీసులు  అతడి ఇంటిపై దాడి చేసి మరో రూ.2కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నగదు రూ.3 కోట్లను బంజారాహిల్స్‌ ఠాణాకు తరలించారు. నగదు పట్టివేత నిజమేనని, ఆ నగదు ఎక్కడిది? ఎవరికి చేరవేస్తున్నారన్న విషయంపై ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, అనిల్‌కుమార్‌ అగర్వాల్‌తో పాటు మరికొందరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: