ఇద్దరి మధ్య బంధం ఎంత దాచాలనుకున్నా దాగటం లేదు. చంద్రబాబు, పవన్ ప్రచారాన్ని గమనించిన వారికి క్విడ్ ప్రో కో విషయం స్పష్టంగా అర్ధమైపోతోంది. ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందే ఇద్దరిపైనా అనుమానాలు వచ్చేశాయి. ఒకదశలో చంద్రబాబు, పవన్ ఇద్దరి మధ్య పొత్తు కుదరుతుందని కూడా అనుకున్నారు. కానీ అదేమీ లేదని తామిద్దరమూ వైరి పక్షాలమే అంటూ ఇద్దరు కథలు చెప్పారు. తీరా ఎన్నికల ప్రక్రియ మొదలై టికెట్లు ఫైనల్ చేసే సమయంలో వారిద్దరి మధ్య బంధం బయటపడిపోయింది.

 

రెండు పార్టీల అభ్యర్ధులకు పెద్దగా ఇబ్బందులు ఎదరుకాకుండా చివరినిముషం వరకూ ఇటు చంద్రబాబు అటు పవన్ అభ్యర్ధులను మార్చుతునే ఉన్నారు. విశాఖపట్నం పార్లమెంటు, భీమిలీ, మంగళగిరి, విజయవాడ సెంట్రల్, నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గాలే అందుకు ఉదాహరణలు.

 

ఇక ప్రస్తుత విషయానికి వస్తే పవన్ రెండు నియోజకవర్గాలు భీమవరం, గాజువాక అసెంబ్లీ స్ధానాల్లో పోటీ చేస్తున్నారు. చంద్రబాబు కుప్పంలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. నారావారి పుత్రరత్నం నారా లోకేష్ గుంటూరు జిల్లాలోని మంద(గ)లగిరి లో పోటీ చేస్తున్నారు. ప్రచారంలో అందరూ బిజీగా ఉన్నారు. మరో ఐదు రోజుల్లో ప్రచారం ముగింపు దశకు వచ్చేసింది. సరిగ్గా  ఇక్కడే ఇద్దరు అధినేతలు అందరికీ దొరికిపోయారు.

 

నారా లోకేష్ పోటీ చేస్తున్న మందలగిరిలో పవన్ ఇంతవరకూ ఎందుకు ప్రచారం చేయలేదు ? కుప్పంలో కూడా జనసేన అభ్యర్ధి డాక్టర్ వెంకటరమణ పోటీ చేస్తున్నాడు కదా ? మరి ఆయన గెలవద్దా ? అందుకు పవన్ ప్రచారం చేయద్దా ?  ఆ నియోజకవర్గాలకు పవన్ ఎప్పుడెళతారు ప్రచారానికి ? అలాగే, గాజువాకలో టిడిపి అభ్యర్ధి పైగా సిట్టింగ్ ఎంఎల్ఏ  పల్లా శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు కద. సిట్టింగ్ ఎంఎల్ఏని గెలిపించుకునేందుకు చంద్రబాబు ప్రచారం చేయరా ?

 

అదే విధంగా పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో కూడా పవన్ పోటీ చేస్తున్నారు.  అక్కడ టిడిపి అభ్యర్ధి, సిట్టింగ్ ఎంఎల్ఏ పులవర్తి రామాంజనేయులును గెలిపించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా ? రోజుకు చంద్రబాబు నాలుగైదు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. పైగా విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా ప్రచారం చేస్తునే ఉన్నారు. కానీ గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని చంద్రబాబుకు ఎందుకనిపించలేదు ? అంటే అజ్ఞాత మిత్రుడని గెలిపించుకునే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు పై నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్ళటం లేదా ? ఇక్కడే తెలిసిపోతోంది ఇద్దరి మధ్య క్విడ్ ప్రోకో వ్యవహారం,

 


మరింత సమాచారం తెలుసుకోండి: