మూడు రోజుల ఎన్నికల ముందు వచ్చిన ఈ సర్వే కూడా జగన్ ప్రభంజనం ఖాయమని తేల్చేసింది. మ‌రో సారి అధికారంలోకి రావాల‌ని బాబు అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను వాడుకుంటుంటే జ‌గ‌న్ మాత్రం ప్ర‌జ‌ల‌నే న‌మ్ముకొని ముందుకు సాగుతున్నారు. మొద‌టి నుంచి ప్ర‌త్యేక హోదాకు క‌ట్టుబ‌డి నిరంత‌రం పోరాటం కొన‌సాగిస్తున్నారు. ప్ర‌జాయాత్ర‌పేరుతో 3600 కి.మీ. పాద‌యాత్ర చేసి ప్ర‌జ‌ల క‌ష్టాలు ప్ర‌త్య‌క్షంగా తెలుసుకున్నారు. ప్ర‌త్యేక హోదాకు క‌ట్టుబడి ఉండ‌టం, ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పోరాటంలాంటి కార్య‌క్ర‌మాల‌తో జ‌గ‌న్‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం పెరిగింది. ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం సాధించ‌డం ఖాయం అని ఇప్ప‌టికే విశ్లేష‌కులు అంచ‌నాకు వ‌చ్చారు.


ఇక స‌ర్వేల ఫలితాలు చూసుకుంటె..ఇప్పటి వరకూ ఆంధ్రా ఎన్నికలపై వచ్చిన దాదాపు అన్ని సర్వేలు వైసీపీయే గెలుస్తుందని చెబుతూ వచ్చాయి. కొన్ని బొటాబొటి మెజారిటీ అంటే.. చాలావరకూ వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుంద‌ని తేల్చి చెప్పాయి. తాజాగా దేశంలో నె అతి పెద్ద టైమ్స్ నౌ-సీఓట‌ర్ స‌ర్వే తాజాగా త‌న స‌ర్వే ఫ‌లితాల‌ను విడుద‌ళ చేసింది. స‌ర్వే ఫ‌లితాల్లో వైసీపీ తిరుగులేని మెజారిటీ సాధిస్తుంద‌ని పేర్కొంది.


టైమ్స్‌నౌ-సీఓట‌ర్ స‌ర్వేలో వైసీపీ 50.5 శాతం ఓట్ల‌తో 130 సీట్లు గెలుచుకొని అధికారం చేప‌డుతుంద‌ని తెలిపింది. ఇక టీడీపీ ప‌రిస్థితి ఘోరంగా త‌యార‌య్యింది. 37.7 శాతం ఓట్ల‌తో 44 సీట్లుగెలుచుకొని రెండో స్థానంలో ఉండ‌నుంద‌ని స‌ర్వేలో తేలింది. ముఖ్య‌మంత్రిని అవుతా అని ప్ర‌గ‌ల్భాలు పలుకుతున్న ప‌వ‌న్ పార్టీ జ‌న‌సేన మాత్రం 9.0 శాతం ఓట్ల‌తో ఒక్క సీటును గెలువ‌నుందంట‌. ప్ర‌ధానంగా జ‌గ‌న్‌కు ఈసారి అవ‌కాశం ఇవ్వాల‌ని మెజారిటీ శాతం ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని స‌ర్వేలో త‌మ అభిప్రాయాలు వెల్ల‌డించారంట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: