విశాఖ జిల్లాలో ఆసక్తి రేపుతున్న నియోజకవర్గాల్లో ఉత్తరం అసెంబ్లీ సీటు ఒకటి. ఇక్కడ నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేయడంతో ఈ సీటుకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఇక్కడ నుంచి గంటా పేరు ప్రకటించినపుడు వచ్చిన వ్యతిరేకత అంతా ఇంతా కాదు, గంటా ప్రతి ఎన్నికకు ఒక సీటు ఎంచుకుంటారని, పార్టీ మారుతాతని వచ్చిన విమర్శలతో గంటా చాలా వెనకబడ్డారు. అదే సమయంలో సొంత పార్టీలో సీటుని ఆశించిన వారు అనేకమంది ఉండడం, వారంతా గంటాకు  దూరం జరగడంతో గంటాకు ఉత్తరం ఇబ్బందికరంగా మారుతుందేమోనని అంతా వూహించారు. మొత్తానికి గంటా ఇపుడు మెల్లగా అన్ని సర్ధుకుని ఎన్నికలకు రెడీగా ఉన్నారు. 

 

గంటా రాజకీయ‌ చతురత, వ్యూహాలు కలసి ఇపుడు ఆయన్ని ఉత్తరం సీట్లో మెల్లగా పై చేయి సాధించేలా చేశాయని చెప్పుకోవాలి. గంటా తన రాజ నీతితో పార్టీలో అందరితో సర్దుబాటు చేసుకోవడమే కాకుండా  పార్టీకి దూరంగా ఉన్న పాత తరం తెలుగుదేశం పార్టీ వారిని కూడా చేరదీసి తనతో కలుపుకున్నారు. ఆ విధంగా గత వారం రోజుల వ్యవధిలో గంటా ఉత్తరంలో మంచి పట్టు సాధించారనే చెప్పాలి. ఇక గంటా పార్టీలో గట్టి నాయకునిగా ఉన్న  స్వాతి క్రిష్ణా రెడ్డి వంటి వారిని కలుపుకోవడం ద్వారా గెలుపు తీరాలవైపుగా అడుగులు వేస్తున్నారనే చెప్పాలి. భారీ రియల్టర్ గా ఉన్న క్రిష్టారెడ్డి ఎన్నికల్లొ టికెట్ కోరుకున్నారు. ఇపుడు ఆయన కూడా పార్టీ గెలుపు  కోసం గంటాతో చేతులు కలిపారు.

 

ఇక గంటా విషయం చూసుకుంటే సొంత పార్టీలో అన్ని రిపేర్లు చేసుకున్నాక ప్రత్యర్ధి పార్టీలపై ద్రుష్టి సారించారు. ఇపుడు అక్కడ వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ నేతలను కూడా కలుపుకుని పోతున్నారు. దీంతో అక్కడ టీడీపీలో జోష్ కనిపిస్తోంది. రెండు దశాబ్దాలుగా గెలవని పార్టీని గంటా ఇపుడు కచ్చితంగా గెలిపిస్తారన్న నమ్మకం క్యాడర్లో కూడా ఏర్పడింది. ఇదిలా ఉండగా మొదట్లో ఉన్న వూపు బీజేపీలో కనిపించకపోవడంతో పాటు, వైసీపీ అభ్యర్ధి కూడా రాజు కావడంలో ఒకే సామాజిక వర్గం ఓట్లు చీలిపోవడం కూడా గంటాకు అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


ఇదిలా ఉండగా ఉత్తరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కూడా చాలా గట్టి అభ్యర్ధిగా ఉన్నారు. ఆయన మీద అవినీతి మచ్చ లేదు. పైగా నిజాయతిపరుడన్న పేరు ఉంది. దాంతో ఆయన నీతికి అవినీతికి యుధ్ధం అంటూ గంటా మీద పోరుకు రెడీ ఐపోయారు. ఇక ఆయనకు సొంత సామాజిక వర్గమే కాదు. ప్రత్యర్ధి పార్టీ నుంచి కూడా గిట్టని వారి సహకారం లభిస్తోదని అంటున్నారు. అదే విధంగా ఇతర సామాజిక వర్గాలు సైతం ఆయనకు దన్నుగా నిలబడుతున్నాయి.


ఇక వైసీపీ అభ్యర్ధిగా ఉన్న కేకే రాజు కూడా చేపకింద నీరులా తన బలాన్ని పెంచుకుంటున్నారు. జనసేన నుంచి బలమైన నాయకుడు గుంటూరు నరసిమ్హమూర్తి వైసీపీలో చేరడంతో ఆయనకు కొత్త బలం వచ్చింది. ఇక్కడ వెలమలు, బీసీలు కూడా వైసీపీ విజయానికి సహకరిస్తున్నారు. కాపుల్లో కూడా వైసీపీ ఓటు షేర్ ఉంది. మొత్తం మీద గంటాపై గెలిచేది తానేనని కేకే రాజు అంటున్నారు.



 

ReplyReply allForward


మరింత సమాచారం తెలుసుకోండి: