బస్సు యాత్ర నిర్వహిస్తున్న షర్మిల శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఐదేళ్లుగా అధికారంలో ఉండి ఏమి చేయని చంద్రబాబు ఇప్పుడు ‘ మీ భవిష్యత్‌ - నా బాధ్యత’  అంటూ వస్తున్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల బాధ్యత చంద్రబాబుది కాదా? లోకేష్‌ భవిష్యత్‌ మాత్రమే చంద్రబాబు బాధ్యతా? ఈ ఐదేళ్లు లోకేష్‌ కోసం పనిచేసి ఇప్పుడు మీ భవిష్యత్‌ నా బాధ్యత అంటున్నారు అని అన్నారు షర్మిల.


ఇప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వాలట. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేసి గెలిపిస్తే మీ భవిష్యత్‌ నాశనం చేస్తారు. ఈ నారాసుర రాక్షసులను నమ్మి మోసపోకండి’  అని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల  ప్రజలను కోరారు.ఒక ముఖ్యమంత్రి ఎలా ద్రోహం చేయకూడదో ఈ ఐదేళ్లలో చంద్రబాబు మనకు చూపించారు. రైతు రుణమాఫీ అంటూ చేసిన మొదటి సంతకానికే దిక్కులేదు. డ్వాక్రామహిళలకు రుణమాఫీ చేస్తానన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఐదేళ్లు ఏమి చేయకుండా పసుపు కుంకుమ అంటూ భిక్షం వేస్తున్నట్లు ఇస్తున్నారు. ఎంగిలి చేయి విదిలిస్తున్నారు. అక్కా చెల్లెళ్లు మోసపోకండమ్మా.


కేవలం​ మహిళలను మభ్యపెట్టడానికి చంద్రబాబు డబ్బులు ఇస్తున్నారు. ప్రత్యేక హోదా ఎంత అవసరం. ప్రత్యేక హోదా ఏపీకి ఊపిరి వంటింది. అలాంటి హోదాన్ని నీరు గార్చిన వారు చంద్రబాబు. ఈ రోజు రాష్ట్రానికి హోదా రాలేదంటే చంద్రబాబే కారణం. బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేశారు. మంత్రి పదవులు కూడా అనుభవించారు. కానీ హోదా తేలేకపోయారు. గత ఎన్నికల ముందు హోదా అన్నారు. పదేళ్లు కాదు 15 ఏళ్లు కావాలన్నారు ఇలా మాటలు మారుస్తూ పబ్బం గడిపారు అంటూ ఆమె మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: