ఎన్నికల ఐదు రోజుల ముందు విడుదల చేసిన వైసీపీ మేనిఫెస్టో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా స్థానికులకే ఉద్యోగాలు అన్న దానిపై చట్టం చేయడం అన్నది గొప్పవిషయం. చిరకాలంగా వలసవాదులే ఉద్యోగాలు పొందుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్ కార్డులను డబ్బులకు కొనుగోలు చేసి, స్థానికేతురులు ఎక్కువగా ఉద్యోగాలు పొందారన్న వ్యవహారం వుంది. ఇప్పుడు అలాంటివి అరికట్డం సాధ్యం అవుతుంది. అలాగే అన్ని వర్గాలకు పనికి వచ్చే వరాలు అనేకం వున్నాయి.


నిరుద్యోగులకు ప్రభుత్వ కాంట్రాక్టులు, అర్చకులకు రిటైర్ మెంట్ రద్దు, యాదవులకు తిరుమల గుడితలుపులు తెరిచే అవకాశం, డ్వాక్రారుణాల రద్దు, జీరో వడ్డీకి రుణాలు, దశలవారీ మద్యనిషేధం, పోడుపై గిరిజనులకు హక్కు, ఇళ్ల రుణాల రద్దు, గ్రామాల్లో వాలంటీర్ల నియోమకం, దళితులకు కరెంట్ పై రాయతీ ఇవన్నీ మంచి హామీలే. ఇవన్నీ నిలబెట్టుకునే అవకాశం జగన్ కు జనాలు ఇస్తే ఇంకా మంచిదే.

జగన్ ఇచ్చిన హామీలు : 

ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజీలు

ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు

2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

ఏటా ఉద్యోగాల క్యాలెండర్‌ విడుదల

70శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం

ప్రభుత్వ కాంట్రాక్టులు నిరుద్యోగులకు ఇచ్చేలా చట్టం

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను పారదర్శకంగా అమలు

డ్వాక్రా రుణాలు నాలుగు విడతలుగా రద్దు

పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు

మూడుదశల్లో మద్యాన్ని నిషేధం

ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో మాత్రమే మద్యానికి అనుమతి

అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1100 కోట్లు

గొల్లలకు తిరుమల శ్రీవారి సన్నిధిలో మళ్లీ తలుపులు తెరిచే అవకాశం

గొర్రెల కాపర్లకు రూ.6 లక్షల జీవిత బీమా

ఎస్సీ, ఎస్టీ యువతుల పెళ్లిళ్లకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం

పోడు భూములపై గిరిజనులకు యాజమాన్యం హక్కు

గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్‌ నియామకం

పేదల ఇళ్ల రుణాలను పూర్తిగా రద్దు

ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 2వేల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌

అర్చకుల రిటైర్మెంట్‌ను తొలగింపు, ఇళ్ల నిర్మాణం

దేవాలయాల్లో దూప ఖర్చుల చెల్లింపు

ముస్లిం యువతుల పెళ్లిళ్లకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం

ఇమామ్‌, మౌజంలకు రూ.15 వేల గౌరవ వేతనం


మరింత సమాచారం తెలుసుకోండి: