ఎప్పుడైతే జగన్ తన మ్యానిఫెస్టో ని విడుదల చేశాడో చంద్రబాబు అంతే వేగంగా విడుదల చేశారు.దాదాపు జగన్ ప్రస్తావించిన అన్ని అంశాలను బాబు కవర్ చేయడం గమనార్హం. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలన చూసి తమకు మరోసారి ఓటు వేయాలని చంద్రబాబు  ప్రజలను కోరారు. ప్రపంచానికే మన మేనిఫెస్టో ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. అవగాహన లేని వాళ్లు మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నారని.. ట్రాక్ రికార్డ్ లేని వాళ్లు ఏదో చేస్తామని చెబుతున్నారని బాబు వైసీపీకి పరోక్షంగా సెటైర్లు వేశారు. తాము ఈ ఐదేళ్లలో చెప్పిన దానికంటే 50శాతం ఎక్కువ సంక్షేమం చేశామని చెప్పారు. పోలీస్ స్టేషన్ లో విత్తనాలు ఎరువు అమ్మేవారని.. టీడీపీ పాలనలో అలాంటివి ఏవీ లేవని బాబు గుర్తు చేశారు.


టీడీపీ మేనిఫెస్టో :

*నిరుద్యోగ భృతి రూ.3వేలకు పెంపు

*పెన్షన్ రూ.3వేలకు పెంపు - అర్హత వయస్సు 65 నుంచి 60కు తగ్గింపు

*సాగుకు 12 గంటల ఉచిత విద్యుత్ సరఫరా

*రూ.5వేల కోట్లతో గిట్టుబాటు ధరల స్థిరీకరణ ఫండ్

*ఏటా అన్నదాత సుఖీభవ పథకం అమలు

*రైతులకు వడ్డీ లేకుండా ఎంతైనా రుణాలు

*కోటి ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ డెవలప్ మెంట్

*మాదిగలు - రెల్లి - యానాది కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు

*ప్రతి మండల - పట్టణ కేంద్రాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు

*డ్వాక్రా మహిళలకు ఉచితంగా సెల్ ఫోన్లు

*చంద్రన్న బీమా రూ.5లక్షల నుంచి రూ10 లక్షలకు పెంపు

*సాగుకు 12 గంటల ఉచిత విద్యుత్ సరఫరా

*విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు

*వ్యవసాయాన్ని ఉపాధి హామీకి అనుసంధానం

*విదేశీ విద్య కోసం పేద విద్యార్థులకు రూ.20 లక్షలు

*ఆదివాసీల కోసం ప్రత్యేక బ్యాంక్ ఏర్పాటు

*ఇంటర్మీడియెట్ నుంచి విద్యార్థులకు ల్యాప్ టాప్ లు

*మత్స్యకారుల క్రాప్ హాలిడేకు రూ.10వేలు సాయం

*వడ్డెర - బ్రాహ్మణ వర్గాలకు ఎమ్మెల్సీ పదవులు

*విద్యుత్ వాహనాలను ప్రమోట్ చేస్తాం

*ప్రతీగ్రామం నుంచి మెయిన్ రోడ్డుకు బీటీరోడ్డు

*పట్టణాల్లో తోపుడుబండ్లకు ఇబ్బందులు లేకుండా చేస్తాం.

*తిరుపతికి ఎలక్ట్రానిక్ హబ్ ఏర్పాటు

*వైద్యంలో రూ.5లక్షల వరకు ఉచిత సాయం.   

వైసీపీ మేనిఫెస్టో : 

ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజీలు

ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు

2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

ఏటా ఉద్యోగాల క్యాలెండర్‌ విడుదల

70శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం

ప్రభుత్వ కాంట్రాక్టులు నిరుద్యోగులకు ఇచ్చేలా చట్టం

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను పారదర్శకంగా అమలు

డ్వాక్రా రుణాలు నాలుగు విడతలుగా రద్దు

పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు

మూడుదశల్లో మద్యాన్ని నిషేధం

ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో మాత్రమే మద్యానికి అనుమతి

అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1100 కోట్లు

గొల్లలకు తిరుమల శ్రీవారి సన్నిధిలో మళ్లీ తలుపులు తెరిచే అవకాశం

గొర్రెల కాపర్లకు రూ.6 లక్షల జీవిత బీమా

ఎస్సీ, ఎస్టీ యువతుల పెళ్లిళ్లకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం

పోడు భూములపై గిరిజనులకు యాజమాన్యం హక్కు

గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్‌ నియామకం

పేదల ఇళ్ల రుణాలను పూర్తిగా రద్దు

ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 2వేల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌

అర్చకుల రిటైర్మెంట్‌ను తొలగింపు, ఇళ్ల నిర్మాణం

దేవాలయాల్లో దూప ఖర్చుల చెల్లింపు

ముస్లిం యువతుల పెళ్లిళ్లకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం

ఇమామ్‌, మౌజంలకు రూ.15 వేల గౌరవ వేతనం


మరింత సమాచారం తెలుసుకోండి: