వూరించి వచ్చిన తెలుగుదేశం మేనిఫేస్టో చివరికి తుస్సుమనిపించింది. దీని కోసం వివిధ సామాజిక వర్గాల నుంచి, మంత్రుల నుంచి ఇతర వర్గాలు, మెధావుల నుంచి ప్రతి ఒక్కరినీ తీసుకుని నెల రోజులకు పైగా మధించి ఆఖరుకు అందించింది ఏంటయ్యా అంటే తెల్లారిలేస్తే చంద్రబాబు పాడుతున్న పాత పాటే. బాబు రోజూ చెబుతున్న అవే మాటలే. వాటినే అచ్చేసి మేనిఫేస్టో అనేశారు.    


 

నిజానికి మేనిఫేస్టోలకు విలువ లేదని 2014 ఎన్నికల్లో టీడీపీ నిరూపించేసింది. అప్పట్లో 650 హామీలతో వేసిన మేనిఫేస్టోకే అతీ గతీ లేదు. ఇపుడు మళ్ళీ మరిన్ని హామీలతో వచ్చిన ఈ మేనిఫేస్టో కధేంటో జనాలే చెప్పాలి. ఉగాది రోజున పోటా పోటీగా విడుదలైన వైసీపీ, టీడీపీ మేనిఫేస్టోలను చూసిన వారంతా టీడీపీ హామీల్లో కొత్త దనం లేదని పెదవి విరిచేశారు. ప్రధానంగా ప్రత్యేక హోదా వూసే లేకుండా బాబు ఎన్నికల ప్రణాళిక రూపుదాల్చడం ఆశ్చర్యకరంగా  ఉంది. హోదా వస్తేనే ఏపీకి అన్ని వస్తాయంటూ గత ఎడాదిగా వూదరగొట్టిన బాబు దాన్ని ఎన్నికల హామీగా ఇవ్వకపోవడం విడ్డూరమే.


నిరుద్యగులకు మూడువేలు భ్రుతి  అది కూడా ఇంటర్ చదివితే చాలు అంటూ పెట్టడం యువత ఓట్ల కోసమేనని తెలుస్తోంది కనీసం డిగ్రీ కూడా చదవకుండా ఇంట్లో కూర్చోబెట్టి సోమరిపోతుల్లా భ్రుతి ఇవ్వడం అంటే దారుణమేనని కామెంట్స్ వస్తున్నాయి. ఇక బీసీ బ్యాంక్, ఇస్లామిక్ బ్యాంక్, క్రిస్టియన్లకు జిల్లాకొ  చర్చి, ఇలాంటివి అన్నీ ఓట్లు దండుకునేందుకు తప్ప మరెందుకు కావని అర్ధమైపోతోంది. అనుభవం కలిగిన నాయకుడుగా విజన్ ఉన్న నేతగా బాబు ఇటువంటి ఎన్నికల ప్రణాళిక విడుదల చేయడం బాధాకరమని మేధావులు కూడా అంటున్నారు.

రైతుల విషయంలో, ఉద్యోగాల విషయంలో వైసెపీ హామీలనే టీడీపీ కూడా అలా పెట్టేసింది. ఇక పించన్లు కూడా రెండు పార్టీలు మూడువేల వంతున హామీ ఇచ్చేశాయి. మొత్తానికి బాబు మేనిఫేస్టోలో చెప్పుకోదగిన ముఖ్యాంశాలు లేవనే చెప్పాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: