జర్నలిస్టులకు  ఇళ్ళు అన్నది చాలాకాలంగా పెండింగులో పడిన డిమాండ్. నిజానికి జర్నలిస్టులు దీని మీద చాలాకాలంగా పోరాడుతున్నారు. అయితే నంధ్యాల ఉప ఎన్నికల వేళ చంద్రబాబు తానే స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. డబులు బెడ్ రూం ఇళ్ళు ఇస్తామని నాడు హామీ ఇచ్చారు. అయితే అది ఇంతవరకూ అమలుకు నోచుకోలేదు.

 


ఇదిలా ఉండగా ఈ విషయమై పాదయాత్రలో ఉన్న జగన్ని నాడు కొన్ని జర్నలిస్టు సంఘాల నేతలు కలసి ప్రస్తావించారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో జగన్ దీని మీద కచ్చితమైన హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఇపుడు వైసీపీ ఎన్నికల ప్రణాళికలో దీనికి చోటు లభించింది. దీని వల్ల అట్టడుగున ఉన్న ఏమీ నోచుకోని జర్నలిస్టులకు ఒక గూడు దొరుకుతుంది. జగన్ కనుక అధికారంలోకి వస్తే ఈ డిమాండ్ కచ్చితంగా తీరుస్తారని యూనియన్ నేతలు అంటున్నారు. ఈ విషయంలో వారు జగన్ని అభినందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 


ఇదిలా ఉండగా బీసీ ఉప కులాలు ఏపీలో వందకు పైగా ఉన్నాయి. వాటి విషయంలో కూడా జగన్ బీసీ గర్జన సందర్భంగా హామీ ఇచ్చారు. తాను ఒకటో రెండో కాకుండా ప్రతీ బీసీ ఉప కులానికి ఒక కార్పోరేషన్ ఇస్తానని ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభలో జగన్ హమీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే అది ఇపుడు ఎన్నికల హామీగా రూపుదాల్చింది. రేపటి రోజున వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ చేసి తీరుతారని కూడా బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: