2014 ఎన్నికల్లో వైస్సార్సీపీ కి రాయలసీమలో మంచి సీట్లు సంపాదించగలిగింది. అయితే అనంతపురంలో మాత్రం వైసీపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. ఒక్క అనంతపురం జిల్లాలో మెరుగైన ఫలితాలను సాధించడం మినహా రాయలసీమలో తెలుగుదేశం పార్టీ పెద్దగా సత్తాచూపింది ఏమీలేదు. అయితే ఈసారి అనంతపురం జిల్లాలో కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్వీప్‌ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనిరీతిలో ఈసారి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ చిత్తు కాబోతోందనే సంకేతాలు అందుతూ ఉన్నాయి.


ముందుగా గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. అనంతపురం జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రెండుసీట్లు వచ్చాయి. కడపలో తొమ్మిది సీట్లు వచ్చాయి. చిత్తూరు జిల్లాలో ఎనిమిది సీట్లను నెగ్గింది. కర్నూలుజిల్లా పదకొండు సీట్లను నెగ్గింది. ఈ ప్రకారం 30 ఎమ్మెల్యే సీట్లను వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నెగ్గగా, తెలుగుదేశం పార్టీ 22 సీట్లకు పరిమితం అయ్యింది. రాష్ట్రంలో తెలుగుదేశం నెగ్గినా రాయలసీమ వరకూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మంచి మెజారిటీని సంపాదించినట్టే.


గత ఎన్నికల్లో అలాంటి చేదు ఫలితాలు రావడంతో రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు చాలా కసరత్తు చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నేతలను మళ్లించుకున్నారు చంద్రబాబు నాయుడు. భారీగా ఫిరాయింపులకు తెరఎత్తారు. ఎమ్మెల్యేలను అలా చేర్చేసుకుంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దెబ్బతింటుందని బాబు లెక్కలేసుకున్నారు. అయితే అలా ఫిరాయించిన నేతలకు చివర్లో చంద్రబాబు నాయుడే టికెట్‌ ఇవ్వలేదు! అదీ ఫిరాయింపుల వల్ల తెలుగుదేశం పార్టీకి ఒరిగినది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు టికెట్లను కేటాయించకపోవడంతోనే.. వాటివల్ల తెలుగుదేశం పార్టీకి ఒరిగింది ఏమీలేదని స్పష్టం అయ్యింది. దీంతో యథారీతిన రాయలసీమలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హవా స్పష్టంగా ఉండబోతోంది! దీనితో మొత్తం 52 స్థానాలలో వైసీపీ ప్రభంజనం ఖాయమని రాజకీయ పండితులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: