అల్లు అర్జున్ .. ఇప్పుడు వైసీపీ నంద్యాల అభ్యర్థిని గెలిపించమని ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శిల్పా రవి రెడ్డికి సినీ నటుడు అల్లు అర్జున్ మద్దతు పలికాడు. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రమ్ ఖాతాలో ఒక పోస్టు పెట్టాడు అల్లు అర్జున్. శిల్పా రవి రెడ్డి తనకు మంచి స్నేహితుడని పేర్కొన్న అల్లు  అర్జున్.. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉండటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.


ఇలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి బెస్ట్ విషెస్ చెబుతూ అల్లు అర్జున్ పోస్టు పెట్టడం ఆసక్తిదాయకంగా ఉంది.ఇప్పటికే జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబుకు అనుకూలంగా ఒక పోస్టు పెట్టిన అల్లు అర్జున్.. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా రవి కి మద్దతుగా మరో పోస్టు పెట్టడం ఆసక్తిదాయకంగా ఉంది. 'నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ద్వారా పొలిటికల్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తున్న నా ప్రియ స్నేహితుడు శిల్పా రవి  రెడ్డికి అభినందనలు.


అనునిత్యం ప్రజాసేవకు తపించే అతడు నాకు గర్వకారణం. ఆయన ఒక మంచి మనిషి, నాకు ఎన్నో సంవత్సరాల నుంచి స్నేహితుడు. అతడి నాయకత్వం సమాజానికి మేలు చేస్తుందని నేను నమ్ముతున్నాను. మాకు రాజకీయంగా వైరుధ్య భావాలుంటాయి, అయితే నా స్నేహితుడికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెబుతున్నా. అతడి కొత్త ప్రయాణానికి ఆల్ ది వెరీ బెస్ట్…..' అంటూ అల్లు అర్జున్ ఇన్ స్టాలో పోస్టు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: