ఏపీ ఎన్నికల విషయంలో జాతీయ పార్టీలు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఎందుకంటే రేపటి రోజున కొత్త ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటు అయితే మద్దతు ఇవ్వాల్సిన పార్టీలు ఏపీ నుంచే ఉంటాయి. దాంతో చాలా నిశితంగా అనేక జాతీయ పార్టీలు ఎప్పటికపుడు ఏపీ ఎన్నికలపై సర్వేలు, విశేషణలు చేయిస్తున్నాయి.

 


ఇదిలా ఉండగా తాజాగా వెలువడిన ఇండియా టుడే సర్వే ఏపీలో వైసీపీ ప్రభంజం వీస్తుందని మరో మారు గట్టిగా చెప్పింది. ఇది పోలింగుకు నాలుగు రోజుల ముందు వెలువడిన సర్వే. దీంతో ఇక జగన్ కచ్చితంగా సీఎం కావం తధ్యమన్న భావనా అంతటా కనిపిస్తోంది. తక్కువలో తక్కువ 18 ఎంపీ సీట్లు జగన్ పార్టీకి ఏపీలో వస్తాయని ఆ సర్వే తేటతెల్లం చేసింది.దాన్ని బట్టి చూసుకుంటే ఏపీలో గ్రాండ్ విక్టరీని వైసీపీ నమోదు చేస్తుందని అంటున్నారు.

 


ఏపీలో ఈ లెక్కన 120కి పైగా అసెంబ్లీ సీట్లను వైసీపీ సునాయాసంగా కైవశం చేసుకుంటుందని అంటున్నారు. ఏపీలో టీడీపీతో హోరాహోరీ పోటీ అని బయటకు కనిపిస్తున్నా ఏకపక్షంగానే ఎన్నికలు సాగుతాయని ఇండియా టు డే సర్వే చెప్పడం విశేషం. ఆ విధంగా ఆలొచన చేస్తే ఏపీలో వైసీపీ అన్ని చోట్లా భారీ మెజారిటీలు నమోదు చేస్తుందని, ఇదే గాలి బలంగా కొనసాగితే మాత్రం 130 సీట్లకు పైగా కూడా దాటి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి ఏపీ కొత్త ముఖ్యమంత్రి ఎవరో ఈ సర్వే బయటపెట్టేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: