పార్టీల ప్రచారానికి 9వ తేదీ సాయంత్రంతో తెరపడే సమయం దగ్గర పడుతోంది. అందుకనే టిడిపి, వైసిపిల అధినేతలు తమ ప్రచార జోరును మరింతగా పెంచుతున్నారు. రోజుకు ఐదారు రోడ్డుషోలు, బహిరంగసభల్లో ప్రసంగాలు చేస్తున్నారు. ప్రచారంలో 46 ఏళ్ళ జగన్ తో 68 ఏళ్ళ చంద్రబాబునాయుడు పోటీ పడుతుండటం విశేషమే.

 

సరే ఇక ప్రస్తుతానికి వస్తే ప్రచారానికి ఉన్నది కేవలం రెండు రోజులే కావటంతో అధినేతలిద్దరూ ప్రచార జోరును మరింతగా పెంచుతున్నారు. అందులో భాగంగా వైఎస్ కుటుంబమంతా ప్రచారంలో నిమ్మగ్నమైన విషయం తెలిసిందే. వీలైనన్ని నియోజకవర్గాలను చుడుతున్న జగన్ తన ప్రచారాన్ని ఎక్కడ ముగిస్తున్నారో తెలుసా ? అక్కడా ఇక్కడా కాదు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న గాజువాక నియోజకవర్గంలో. ఎలావుంది లాస్ట్ పంచ్ ?

 

విశాఖపట్నం జిల్లాలో జగన్ పర్యటించినా ఇప్పటి వరకూ గాజువాకలో ప్రచారం చేసింది లేదు. పవన్ కు పోటీగా టిడిపి సిట్టింగ్ ఎంఎల్ఏ పల్లా శ్రీనివాస్ పోటీ చేస్తుండగా వైసిపి తరపున తిప్పల నాగిరెడ్డి పోటీలో ఉన్నారు. ముందు కాస్త వెనకబడినా నాగిరెడ్డి రెండు రోజుల్లో బాగా పుంజుకున్నారు.

 

స్టీల్ ప్లాంట్, సాఫ్ట్ వేర్ కంపెనీలు, ఆసుపత్రిలు కూడా ఎక్కువున్నాయి. కాబట్టి ఇక్కడ కార్మికుల ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయట. స్లీల్ ప్లాంట్ కార్మికులు ఎక్కువగా ఉండటం, కార్మిక యూనియన్ నేత మంత్రి రాజశేఖర్ చేరటం వైసిపికి ప్లస్సనే చెప్పాలి. ఇక్కడున్న 3.09 లక్షల ఓటర్లలో బిసిలు ఎక్కువ. పల్లా శ్రీనివాస్, నాగిరెడ్డి ఇద్దరు బిసిలు కాగా పవన్ కాపన్న విషయం తెలిసిందే.

 

పవన్ ను దెబ్బకొట్టేందుకే జగన్ తన చివరి రోడ్డుషోను గాజువాకలో ముగించాలని ప్లాన్ చేస్తున్నారట. తన రోడ్డుషోతో జనాలను ఆకర్షించి నాగిరెడ్డి విజయానికి ఊపుతెచ్చి ఒకే సారి ఇటు పవన్ ను అటు పల్లాను దెబ్బ కొట్టాలని నిర్ణయించారట. మరి జనాలు ఏం చేస్తారో చూడాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: