ఆయన ముద్దు పేరు జాక్ పాట్ సీఎం. లక్కీగా ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి అయి మూడేళ్ళ పాటు పాలించిన స్మార్ట్ పొలిటీషియన్. మంత్రి కాకుండానే ముఖ్యమంత్రి అయిన నేతగా రికార్డు స్రుష్టించిన నల్లారి చిత్తూరు జిల్లాకు చెందిన వారు.  రాజకీయంగా పట్టు పెద్దగా లేరు, వెంట నలుగురు నాయకుల ఫాలోయింగ్ లేదు. అయినా ఆయన సీఎం ఐపోయారు. అదే జాతకమంటే.

 


కిరణ్ కుమార్ రెడ్డి విభజనను వ్యతిరేకించామని గట్టిగా చెప్పుకున్నారు. చివరి బంతి అంటూ హడావుడి అప్పట్లో చేశారు. ఇక సమైఖ్యాంధ్ర పార్టీ పెట్టారు. ఆ పార్టీ తరఫున పోటీ చేయకుండా తమ్ముడిని అభ్యర్ధిగా పెట్టారు. చివరికి ఒక్కరు కూడా గెలవలేదు. దారుణంగా డిపాజిట్లు గల్లంత య్యాయి.  ఆ తరువాత అయిదేళ్ళ పాటు రాజకీయ వనవాసం స్వయం గా విధించుకున్న నల్లారి వారు ఆ పార్టీ ఈ పార్టీ అంటూ ప్రచారంలోకి వచ్చినా చివరికి కాంగ్రెస్ లో చేరారు. అప్పట్లో కాంగ్రెస్ టీడీపీ కలసి ఏపీలో పోటీ చేస్తారని అనుకున్నారు.

 


అలాగైతే రాజంపేట నుంచి ఎంపీగా చేసి కేంద్రంలో చక్రం తిప్పాలని నల్లారి వారు కలలు కన్నారు. అయితే తెలంగాణాలో ఆ పొత్తు చిత్తు కావడంతో బాబు కాంగ్రెస్ తో డైరెక్ట్ పొత్తులకు రెడీ కాలేక పక్కన పెట్టేశారు. దాంతో నల్లారి వారి ఆశలు కూడా అడియాశలు అయ్యాయి. ఇక ఆయన ఇంట్లో కూర్చుని ఇపుడు అందరిలాగానే టీవీ చూస్తున్నారని అంటున్నారు. చేరితే టీడీపీలో చేరాలి. లేకపోతే వైసీపీ, ఎక్కడ చేరినా అయనకు తగిన గౌరవం ఉంటుందని చెప్పలేం. దాంతో ఆయన ప్రస్తుతానికి రాజకీయాలు పక్కన పెట్టేసి అందరిలాగానే ఫలితాల కోసం చూస్తున్నారు. రేపటి రోజున ఏపీలో గెలిచే పార్టీని బట్టి నల్లారి వారి భవిష్యత్తు వ్యూహాలు ఉంటాయని అంటున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: