శ్రీకాకుళం జిల్లాలో హాట్ సీటు గా టెక్కలిని చెప్పుకుంటారు. ఇక్కడ నుంచి నోరున్న పేరున్న మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్నారు. ఆయనకు పోటీగా రాజకీయంగా పెద్దగా అనుభవం లేని కుర్రాడు పేరాడ తిలక్ బరిలో ఉన్నారు. పేరుకు కుర్రాడే కానీ చిచ్చర పిడుగులా ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్నారు. దాంతో అచ్చెన్నకు చెమటలు పడుతున్నాయి.

 



నిన్నటికి నిన్న జగన్ టెక్కలిలో పెట్టిన సభకు ఇసుక వేస్తే రాలనంతగా జనం వచ్చారు. దాంతో టెక్కలి వైసీపీ ఖాతాలోకేనని ఆ పార్టీ నాయకులు ఖాయం చేస్తుకున్నారు. ఇక్కడ కాళింగుల జనాభా ఎక్కువ. వెలమలు, కాళింగుల మధ్య రాజకీయ ఆధిపత్యం పోరు సాగుతూ వస్తోంది. దాంతో తమ మనిషిని అసెంబ్లీకి పంపాలని ఇక్కడ కాళింగులు భావిస్తున్నారని భోగట్టా. కాళింగ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ అభ్యర్ధికి దీంతో కొంత ఎడ్జ్ కనిపిస్తోంది. దాంతో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు.

 


ఇక వెలమలు కూడా ఇక్కడ గణనీయమైన జనాభాగా ఉన్నరు. ఇక్కడ నుంచి 2014 ఎన్నికల్లో గెలిచిన అచ్చెన్నాయుడు తన రాజకీయాన్ని బాగానే గట్టి పరచుకున్నారు. పైగా అధికారం చేతిలో ఉండడం, వ్యూహ రచన బాగా చేయడం వంటివి ఆయనకు ప్లస్ గా  ఉన్నాయి. ప్రజల్లో అధికార పార్టీపై వ్యతిరేకత ఉన్నా తన చతురతతో మంత్రి వాటిని అధిగమిస్తారని అంటున్నారు. ఇక యువకుడైన తిలక్ కి కేంద్ర మాజీ మంత్రి కిల్లి క్రుపారాణి రాజకీయంగా సహాయం చేస్తున్నారు. దాంతో ఇద్దరి మధ్యన ఢీ అంటే ఢీ అనేలా పోరు ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: