విజయనగరం జిల్లాలో హాట్ సీటుగా చీపురుపల్లిని చెప్పుకుంటారు. అక్కడ రాజకీయంగా ఢక్కమెక్కీలు తిన్న బొత్స సత్యనారాయణ వైసీపీ నుంచి అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి మాజీ మంత్రి కిమిడి మ్రుణాళిని కుమారుడు నాగార్జున పోటీ చేస్తున్నారు. తొలిసారి బరిలో ఉన్నా నాగార్జునకు అనేక సార్లు గెలిచిన బొత్సకు మధ్య పోరు ఆసక్తికరంగా ఉంది.

 


ఇక్కడ మొదట్లో టీడీపీ అభ్యర్ధి మీద తీవ్రమైన అసమ్మతి ఉంది. దాన్ని మెల్లగా సర్దుకుని ఇపుడు కిమిడి నాగార్జున ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న నాగార్జున  అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన తల్లి మ్రుణాళిని పట్ల అటు పార్టీలో, ఇటు జనంలో ఉన్న వ్యతిరేకత నేపధ్యంలో టికెట్ మరో వర్గానికి పోకుండా నాగార్జున దక్కించుకున్నారు. దాంతో అక్కడ సీనియర్ నేతలు కొంతమంది తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అయితే వారిని మెల్లగా దారికి తెచ్చారు. ఇక తూర్పు కాపు సామజిక వర్గానికి చెందిన నాగార్జున పెద్ద సంఖ్యలో ఇక్కడ అదే సామాజిక వర్గం ఉండడం, పార్టీతో పాటు, కుటుంబ పరంగా ఉన్న బలంతో గెలిచేందుకు అడుగులు వేస్తున్నారు.

 


ఇక బొత్స విషయానికి వస్తే ఆయన గత సారి విభజన టైంలో కూడా కాంగ్రెస్ తరఫున నిలబడి బాగానే ఓట్లు తెచ్చుకున్నారు. అక్కడ బొత్స బలం చెక్కుచెదరలేదు, పైగా ఇపుడు వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. దాంతో ఆయనకు సానుకూలం కానుంది. రాజకీయ చతుతర నైపుణ్యం బాగా కలిగిన బొస్త తనదైన రాజకీయాలు బాగా చేస్తున్నారు. టీడీపీలో అసమ్మతిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి చూస్తున్నారు. దాంతో ఇక్కడ బొత్సకు అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. మరి కిమిడి కుటుంబం కూడా తక్కువ కాదు కాబట్టి వారి వ్యూహాలు వారికి ఉన్నాయి. అందు వల్ల  ఇది హాట్ సీట్ గానే ఉంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: