ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఏ పార్టీకి అధికారం వస్తుందా అని ఇప్పటికే చాలామంది ఉత్కంఠభరితంగా ఏపీ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్నారు. రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయని మూడు పార్టీల మధ్య ఈ ఎన్నికల పోరు సాగుతుంది.


ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో అధికారం ఎవరు చేపడతారు అన్నది గమనిస్తే ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లా ఓటర్ నాడి బట్టి చెప్పవచ్చు అని రాజకీయ విశ్లేషకులు ఈ మధ్య విశ్లేషిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రజలు ఎంత మర్యాద ఇస్తారో అదేవిధంగా తమ బిడ్డల కోసం భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల కోసం ఆలోచిస్తారని ఓటు కూడా అదే విధంగా వేస్తారని అసలు 1994వ సంవత్సరంలో దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి స్కోప్ లేని క్రమంలో ఆ సమయంలో తూర్పు గోదావరి జిల్లా ప్రజలు ఆదరించారని ఇండిపెండెంట్ లను సైతం కూడా గెలిపించిన ఘనత తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు దక్కుతుందని అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు.

ముఖ్యంగా 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటానికి తూర్పుగోదావరి ప్రజలు ఇచ్చిన తీర్పు ఎవరు మరిచిపోలేరని..కేవలం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వారి ఆలోచిస్తారని భవిష్యత్తు ముందుచూపు ఉన్న ప్రజలు తూర్పుగోదావరి ప్రజలని డబ్బు కో మద్యానికి అమ్ముడు పోయే ప్రజలు కాదని రాజకీయ అవగాహన ఎక్కువ ఉన్న జిల్లా తూర్పు గోదావరి జిల్లా అని మాస్ మరియు క్లాస్ ప్రజలు ఉన్న ఈ జిల్లాలో ఓటరు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రధాన మూడు పార్టీలలో ఏ వైపు మొగ్గు చూపుతారో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: