గత కొంత కాలం నుండి తెలుగుదేశం పార్టీ చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకుని ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తుందని ఇటీవల వైసిపి పార్టీకి చెందిన నాయకులు ఢిల్లీలో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ వైసిపి నేతలు చేసిన ఫిర్యాదును స్వీకరించి రాష్ట్రంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులను విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వానికి జారీ చేయడం జరిగింది.


అయినా కానీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు నిధుల నుంచి తప్పించిన గాని తెలుగుదేశం పార్టీకి ఇంకా అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సిఈసీకి ఫిర్యాదు చేశారు విజయసాయిరెడ్డి. ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పోలీసు వ్యవస్థను వాడుకుంటూ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓఎస్డీ లుగా ఉన్న యోగానంద, మాధవరావు కూడా తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తున్నారని ఆరోపించారు విజయసాయిరెడ్డి. అంతేకాకుండా ఇదంతా డిజిపి ఠాకూర్ కనుసన్నల్లో జరుగుతుందని వైసిపి పార్టీ కేంద్ర ఎన్నికల కమీషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది.



ఇదే క్రమంలో లా అండ్ ఆర్డర్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాసు ను విధుల నుంచి తప్పించాలని సిఈసీకి ఫిర్యాదు చేసింది వైసీపీ పార్టీ. దీంతో ఈ వ్యవహారం మొత్తం చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎన్నికలలో ఓడిపోతాడని భయంతోనే చంద్రబాబు చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారని ప్రజలను భయపెట్టి కుట్రలు చేసి వచ్చే ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఇది అంత సులువైన పని కాదు అని టిడిపి ప్రభుత్వం భాగోతం మొత్తం ప్రజలందరికీ తెలిసిపోయిందని రాబోయే ఎన్నికలలో టిడిపి పార్టీ గల్లంతవ్వడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: