కడప జిల్లాలోని ముఖ్య నియోజకవర్గాల్లో రాజంపేట ప్రధానమైనది. ఇక్కడ తెదేపా వర్గాల్లో సీట్ కోసం నామినేషన్ కి ముందు చాలానే కుమ్ములాటలు జరిగాయి. దీంతో నియోజకవర్గం లో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జున్ రెడ్డి 2014లో టీడీపీ పార్టీ నుంచి గెలుపొంది, ఈ సారి ఎన్నికల కు మాత్రం వైఎస్సార్సీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ పరిణామం టీడీపీ కి తీవ్రమైన దెబ్బే. ఇలాంటి సమయంలో చంద్రబాబు గారికి కొత్త అభ్యర్థి నిలపెట్టడనికి కసరత్తులు చేయాల్సి వచ్చింది.ఈ నియోజకవర్గం నుంచి బత్తల చెంగల్ రాయుడు ను బరిలోకి దించనున్నారు. జనసేన నుండి పత్తిపాటి కుసుమ కుమారి బరిలోకి దిగడంతో ఇక్కడ పోరు రసవత్తరం అయిపోయింది. అయితే పోటీ మాత్రం గట్టిగా ఉండదనే చెప్పాలి. పెద్దగా పోటీ లేకపోయినా రావాల్సిన ఓట్లు ఎక్కడ చీలుతాయో అన్న భయం అందరిలో కనపడుతుంది. 

మల్లికార్జున్ రెడ్డి కి ఈ సారి తిరుగులేదని మళ్లీ ప్రజలు ఆయనకే పట్టం కట్టబోతున్నరు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇదే నిజయితే వైఎస్సార్సీపీ పార్టీ 2009 తరవాత మళ్లీ తన జెండా ను ఎగురవేయడం ఖాయం. కానీ రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఎలా మారుతాయి అని చెప్పలేం కదా. అందుకే ఫలితాలు వచ్చేదాకా వేచి చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: