కేసీఆర్..  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బూచీగా చూపించడంతో మొదలైంది బాబు తెదేపా ప్రచారం.  పవన్ కళ్యాన్, మిగిలిన వారందరూ దానినే ఆయుధంగా వాడటం మొదలు పెట్టారు.  అస్సలు కేసీఆర్ పేరు లేకుండా ప్రచార సభ పూర్తే కాదన్నంతదిగా కేసీఆర్ పేరును వాడుకున్నారు బాబు, పవన్ వారి పార్టీలు.


మన రాష్ట్రం, మన కష్టాలు, మన సంగతేంటో చెప్పకుండా సాటి తెలుగోడి మీద పడి ఏడవడమేమిటని విసిగెత్తి ఉన్న ఆంధ్రప్రజలకు మరీ - మరీ కేసీఆర్ ను విలన్ ని చేయడం ద్వారా తాము లాభపడాలని ప్రయత్నిస్తునే ఉన్నారు ఈ పార్టీలు వారి నాయకులు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 


తాడిని తన్నేవాడుంటే - వాడి తలదన్నే వాడుంటాడనేది ప్రసిద్ద తెలుగు సామెత,  అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లున్న కేసీఆర్ ఇన్నాళ్లూ చూశాడు - విన్నాడు, రేపటి రోజు ఎన్నికల ప్రచారానికి ఆఖరనగా నీట్ గా - సాఫ్ సీదా జనాలకు అర్థమయ్యే రీతిన దాదాపు నెల్లాళ్ళ పాటు తమ మీద జరిగిన దాడికి సమూలార్థం వచ్చేటట్లు సమాధానం చెప్పేశాడంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


ఏపి ప్రజలు మంచోళ్లు, ఏపి ప్రజలతో మాకు పంచాయితేమీ లేదు, పేచీ లేదు.  పోలవరం ప్రాజెక్టుకు మేము అడ్డం పడము, పోలవరం ప్రాజెక్టు కు సంపూర్ణ మద్దతిస్తున్నాం. ఏపి ప్రత్యేక హోదా గురించి మా ఎంపీలు లోక్ సభలో అడిగారు.  ఏపి ప్రత్యేక హోదాకు మా సంపూర్ణ మద్దతుంటుంది.


ప్రజల సంక్షేమంలో మేం రాజకీయాలు చేయం..ఇవన్నీ సరళంగా - చక్కగా..విస్పష్టమయిన మాటలతో కేసీఆర్ చెప్పిన విధంగా హుందాగా - ముఖ్యమంత్రి పార్టీ అధినేత స్థాయికి తగ్గట్లుందంటున్నారు ఆంధప్రజ.


కేసీఆర్ టైమ్ బావుంది, ఏమంటే అది జరుగుతుంది, కేసీఆర్ నోటి చలువ ఆంధ్రకు ప్రత్యేక హోదా వస్తుందేమోనంటున్నారు ఆంధ్రప్రజ. 


మరింత సమాచారం తెలుసుకోండి: