ప్రతి కుక్కకూ తనదంటూ ఒక రోజుంటుంది. రోజు మనదైనపుడు, మనకు అవకావం వచ్చినపుడు చేతనయినంత మంచి చేస్తే..మనమంటూ ఒకళ్ళం ప్రజల హృదయాల్లో నిలిచి ఉండే అవకాశం ఉంటుంది.


శివాజీ అనే పేరును ఉచ్చరిండానికి, శివాజీ మా తెలుగు వాడే అని చెప్పుకోవడానికి మనసొప్పనంతగా మమ్నల్నిబ్బంది పెడుతున్నాడు శివాజీ అంటున్నారు ఆంధ్రప్రజ.


ఎవ్వరికీ ఒక గింజ బియ్యం పెట్టని వాడు, మంచి-చెడు చూడని వాడు, వాడెవ్వడో మాకు అవసరం లేదు బాబోయ్ అంటున్న ఒక సెక్షన్ మీడియాను అడ్డం పెట్టుకొని మమ్ముల్నందర్నీ ఇబ్బందికర పరిస్థితుల్లో పడేస్తున్నవాడీ శివాజీ అంటున్నారు ఆంధ్రప్రజ.


ఇప్పటికిప్పుడు పిలవని పేరంటానికి - తెలియని పెద్ద మనిషిలా వచ్చి  గడ-గడా, చెడా-మడా మాట్లాడేసిల్లిపోయాడియన టివిలో.. ఇక నుంచి లైవ్ లో ఇవే కామెంట్ లను తిప్పి - తిప్పి - తిప్పి ప్రసారం చేస్తాయి కొన్ని మీడియా చానెళ్ళు.


శివాజీనేమో హైదరాబాద్ లో కుక్కల్లా బతకాలా అని అడుగుతుంటే..సిగ్గేస్తుంది. ఎందుకంటే..ఎలా బ్రతుకుదామని కోట్లు పెట్టి భవనాలు, మంత్రాగం, యంత్రాగం తయారు చేసుకున్నాం ఎవడి బాబు సొమ్మని ఖర్చుపెట్టాం? రాత్రికి రాత్రి పారిపోయి ఎందుకు వచ్చాం అని సిగ్గేస్తుందంటున్నారు ఆంధ్రప్రజ.


కేసీఆర్.. తన తెలంగాణాని సామ-దాన-బేధ-దండోపాయాలనుపయోగించి..కేవలం రెండు ఎంపీ  స్థానాలతో సాదించుకున్నాడు. ఉద్యమ సమయంలో ఏవో కానీ..గత ఐదేళ్లలో ఏనాడు ఆంధ్రప్రజని ఇబ్బంది పెట్టలేదు, కులాల, మతాల, ప్రాంతాల వారిగా విడదీయలేదు.  అలాంటిది ఈనాడు శివాజీ తన స్వార్థానికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. మా తరుపు వకల్తా..ఎవడిచ్చాడండీయనకు..ఎవడండీ ఈ శివాజీ అని మదన పడుతున్నారు ఆంధ్రప్రజ. 


మరింత సమాచారం తెలుసుకోండి: