2019 ఎన్నికల్లో తో  టీడీపీ కథ ముగిసిపోతుందని నిన్ననే ఇంకొక సర్వే కూడా చెప్పింది. ఒకటే ఏమిటి ఇప్పటికే చాలా జాతీయ సర్వేలు ఇదే విషయాన్ని తేల్చేశాయి. పాపం పచ్చ మీడియాకు ఇవన్నీ నచ్చవు కదా .. అందుకే వాళ్ళే వండి వార్చి ప్రజల మీదకు వదులుతున్నారు. నిన్ననే ఒక తోక మీడియా వర్గం చాణక్య పేరుతో ఒక సర్వేను ప్రచారంలోకి తెచ్చింది. కనీసం వెబ్ సైట్ కూడా లేని ఆ సంస్థచేసిన సర్వేతో ఏపీలో తెలుగుదేశం గెలుస్తోందని తేలిపోయిందని ఆ మీడియా వర్గం తేల్చేసింది.

అంతకు ముందే సదరు తోక మీడియా ఒక ఏప్రిల్ ఫూల్ సర్వేను తెర మీదకు తెచ్చిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి నోటీసులు వెళ్లాయి. ఇక తాజాగా.. మరో చానల్ రెచ్చిపోయింది. తెలుగుదేశం పార్టీ గెలిచేస్తోందని పచ్చ మీడియా ట్రూపులోని ఒక చానల్ ప్రకటించింది.ఈ చానల్ అవతరాలను చూసి ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు దాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఆ చానల్ ఎడిటర్ ఒకరిని లోకేష్ బాబు అంకుల్ అని పిలుస్తారట. అంత బంధం ఉంది మరి.

తెలుగుదేశం పార్టీకి నూటా మూడు సీట్లు వస్తాయంటే ఈ పచ్చ మీడియా వర్గం ప్రచారాన్ని మొదలుపెట్టింది. అయినా.. తెలుగుదేశం పార్టీకి అంత వీరాభిమాన వర్గం అయిన ఈ మీడియా వర్గమే టీడీపీకి మరీ నూటా మూడు వస్తాయని చెప్పడం కూడా వాళ్లలోని భయాన్ని తెలియజేస్తూ ఉంది. అయినా తెలుగుదేశం పార్టీ గెలుస్తోందని తెలుగుదేశం పార్టీ వాళ్ల చానళ్లే ప్రకటించుకుంటే నమ్మేదెవరు? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తోందని జాతీయ మీడియా చెబుతూ ఉంటే, టీడీపీ గెలుస్తోందని జాతి మీడియా చెబుతోంది. అదీ తేడా!

మరింత సమాచారం తెలుసుకోండి: