ఏపీలో ఇపుడు ఎక్కడ చూసినా జగన్ నామస్మరణ బాగా జరుగుతోంది. అభిమానులు, పార్టీ వారు చెప్పడం వరకూ ఒకే అయినా. ఇతర పార్టీల వారు ప్రతీ రోజూ జగన్ అని కొన్ని వందల సార్లు అనలేకుండా ఉండలేకపోతున్నారు.  జగన్ పేరు అంతలా ఏపీ ఎన్నికల్లో పాపులర్ అయిపొయింది. అది వైసీపీ మీటింగు అయినా, ప్రత్యర్ధి పార్టీల సభలైన జగన్ పేరు ఉండాల్సిందే.

 


జగన్ గెలిచేస్తున్నాడు ఇది వైసీపీ నేతలు అంటే అంతగా ఆశ్చర్యం లేదు. కానీ ప్రత్యర్ధి పార్టీలు చెబుతున్నాయి. చెప్పకనే చెబుతున్నాయి. అక్కసుతో చెబుతున్నాయి. మొత్తానికి ఏపీలో ఉన్న వాతావరణాన్ని చూసి చెబుతున్నాయి. ఇక సర్వేలు పక్కన పెట్టి చూసినా జగన్ గెలిచేస్తున్నాడు అన్న దానికి ఇంతకంటే రుజువు ఏం కావాలి అని వైసీపీ నేతలు అంటున్నారు.

 


చంద్రబాబు ప్రతి సభలలో జగన్ అధికారంలోకి వస్తే అంటూ ప్రారంభిస్తున్నారు. జగన్ రావడం ఏంటి నేనే వస్తున్నా అని ధైర్యంగా బాబు చెప్పలేకపోతున్నారు. టీడీపీ సామంతులు, ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న మెధావులు, మాజీ నటులు అంతా జగన్ అధికారం సీఎం ఇలా గత కొన్ని రోజులుగా జగన్ ఫోబియాతో ఉన్నారు. సామాన్య జనానికి మాత్రం అర్ధమైపోతోంది జగన్ వస్తు న్నాడని వీరి చేష్టలను బట్టి.

 


ఇక ఆఖరుకు జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం చెబుతున్నారు జగనే సీఎం అని. రాజమహేంద్రవరం సభలో పవన్ మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అంటున్నారు. అన్ని సర్వేలు చెబుతున్నాయి అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన వైపు ఎవరూ ఉండడంలేదంటూ సినీ నటుడు ఆలీపైన అక్కసు వెళ్ళగక్కారు. మరి పోలింగుకు రెండు రోజులే సమయం ఉంది. పవన్ మూడవ పక్షం, పైగా కింగ్, కింగ్ మేకర్ అన్నారు.  ఆయనే ఇలా నిర్వేదంగా మాట్లాడుతూంటే జగన్ గెలిచేసినట్లే కదా అంటున్నారు విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: