జనసేన పార్టీ పెట్టిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన ప్రచారం మొత్తం తీసుకుంటే రాజకీయ అవగాహ న లేమి స్పష్టంగా కనిపిస్తుంది. అధికార పార్టీ, అయిదేళ్ళ పాటు ఏపీని ఏలిన టీడీపీని వదిలేసి ప్రతిపక్షం  వైసీపీని ఎపుడైతే విమర్శిస్తూ స్టాండ్ తీసుకున్నారో అపుడే పవన్ రాజకీయం తేలిపోయింది.

 


ఇక ముగింపు దశలో ఆయన రాజమహేంద్రవరంలో నిర్వేదంతో చేసిన ప్రసంగం ఇపుడు వైరల్ అవుతోంది. పవన్ నోట ఇలాంటి బేల మాటలేంటి అని ఆయన వీరాభిమానులు సైతం షాక్ తినే పరిస్థితి. పవన్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని అంతా అనుకునే పరిస్థితి. ఆ సభలో పవన్ అన్న మాటలు తీసుకుంటే రాజకీయంగా పవన్ ఆలోచనలు ఇంతేనా అనిపించక మానదని అంటూ సెటైర్లు పడుతున్నాయి.

 


తాను తొలి సినిమా చేసినపుడు స్టార్ అవుతానని తనతో సహా ఎవరూ అనుకోలేదని, అయినా తాను గొప్ప స్టార్ కావడమే కాకుండా ప్రధాని సరసన కూర్చుకునే దాకా వెళ్ళాలని పవన్ చెప్పుకున్నారు. బాగానే ఉంది కానీ సినీ జీవితం వేరు, రాజకీయం వేరు రెండూ జనాలతోనే ముడి పడి ఉన్నా సినిమా అన్నది రీల్ లైఫ్. అక్కడ దర్శకుడు హీరోయిజాన్ని ఎంత బాగా పండిస్తే అంతగా ఆడియన్స్ కనెక్ట్ అవు తారు.

 

మరి రాజకీయాల్లో రియల్ హీరోయిజాన్నే జనం చూస్తారు. ఇక్కడ సినిమాలా ఉండదు, ప్రాంటింగులు అసలే ఉండవు. డైరెక్టర్ ఎవరు నడిపించలనుకున్నా కుదిరే వ్యవహారం అంతకంటే కాదు. వేసే ప్రతి అడుగు ఇక్కడ జనం రికార్డ్ చేస్తారు. పవన్ లో చరి ష్మా ఉంది. యువతను అట్రాక్ట్ చేసే గొప్ప గుణం ఉంది. పైగా మంచి ఆలోచనలు కూడా ఉన్నాయి. ఎన్నికల రాజకీయం పక్కన పెట్టి ఈ రోజు నుంచి పవన్ మరింతగా పార్టీని జనంలోకి తీసుకువెళ్ళినా ఆయనకంటూ స్పేస్ ఉంటుంది. అవకాశాలు ఉంటాయి. అయితే పవన్ చేయాల్సింది షార్ట్ టైం పాలిటిక్స్ కాదు. ఫుల్ టైం పాలిటిక్స్. అలా జనంలో ఉంటే పవన్ కి కూడా జనం తప్పక అవకాశం ఇస్తారు. పవన్ ఆ దిశగా అడుగులు వేయాలి తప్ప ఎవరినో నిందించి ప్రయోజనం లేదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: